దసరాకు డబుల్ ధమాకా ఇవ్వనున్న బాలయ్య..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ పూర్ణ హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ'. ఈ సినిమాపై మొదటి నుండే బాలకృష్ణ అభిమానులతో పాటు సినీ జనాలలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా ,లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలపడమే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హైడ్రిక్ చిత్రం 'అఖండ' ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర గా  రైతుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్రబృందం ఇప్పటికే విడుదల చేయగా, ఇవి జనాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరియు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఈ సినిమాను బోయపాటి శీను ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలపై బోయపాటి శీను ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటి వరకు ప్రకటించక పోయినా ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


 దసరాకు విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' సినిమా క్యాన్సల్ అయినట్లు వార్తలు రావడంతో ఆ స్థానంలో బాలయ్య "అఖండ' ను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరియు దీనితో పాటే త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అఫిషియల్ న్యూస్ ను కూడా దసరాకే విడుదల చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్ లో ఒక న్యూస్ చక్కెర్లు కొడుతుంది. మరి ఈ వార్త నిజమే అయితే బాలకృష్ణ అభిమానులకు దసరా పండుగకు డబల్ ధమాకా న్యూస్ అన్నట్లు చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: