నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం బోయపాటి శ్రీను తీస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ఇతర బ్యాలెన్స్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు.
గతంలో బాలకృష్ణ తో బోయపాటి శ్రీను తీసిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలు సొంతం చేసుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ పై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ ప్రాజక్ట్ అఖండ సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ఆడియన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో భారీగా నిర్మించనున్నారు.
పవర్ఫుల్ కాప్ స్టోరీ గా యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో బాలకృష్ణ కి జోడిగా ఒక స్టార్ కథానాయిక నటించనుందని, అలానే ఈ సినిమాకి క్రియేటర్ అనే టైటిల్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. గతంలో ఈ మూవీకి టార్చ్ బేరర్ అనే టైటిల్ అనుకున్నట్లుగా వార్తలు రాగా మూవీ టీమ్ మాత్రం క్రియేటర్ వైపే మొగ్గుచోపుతోందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి అంటే దీనిపై మూవీ యూనిట్ నుండి అఫీషియల్ గా ప్రకటన రావాల్సిందే. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనుండగా దీనిని త్వరలో పట్టాలెక్కించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.