'బిగ్ బాస్' తెలుగు లో అత్యంత ప్రజాదరణ పొందిన
రియాల్టీ షో లలో ఒకటి. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ 'షో' ప్రస్తుతం ఐదో సీజన్ అంతా సిద్ధం అయ్యింది. ఈ 'షో' కు సంబంధించిన ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే బుల్లితెర అభిమానులు మరియు 'బిగ్ బాస్' అభిమానులు ఈ 'షో' ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ ఫైవ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే
నాగార్జున సీజన్ మూడు మరియు నాలుగవ సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం
నాగార్జున 'బిగ్ బాస్' అయిదవ అ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 'స్టార్ మా' లో 'బిగ్ బాస్' సీజన్ ఫైవ్ తెలుగు టెలికాస్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే 'బిగ్ బాస్' షో యూనిట్ పదహరు మంది కంటెస్టెంట్లను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ లిస్టులో
నటరాజ్ మాస్టర్, ప్రియా, అనీ మాస్టర్,
శ్వేతా వర్మ, ఉమాదేవి, మానస, వీ జే సన్నీ, షణ్ముఖ్,
ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, జశ్వంత్, లహరి,
సిరి హనుమంత్, సరయు, విష్ణు లు ఉన్నారు. ప్రస్తుతానికి వీరందరూ క్వారంటైన్ లో ఉండగా, మొదటి
ఎపిసోడ్ లో వీరందరూ 'బిగ్ బాస్'
హౌస్ లోకి ఎంటర్ అవుతారు. ఇక వీరిలో , షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ , కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి అత్యధిక పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విరు వారానికి 40 వేల వరకు తీసుకోబోతున్నట్లు ఫిల్మీ దునియా లో గుసగుసలు వినపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న 'బిగ్ బాస్' సీజన్ ఫైవ్ తెలుగు ఎలాంటి ప్రజాదరణను దక్కించుకుంటుందో తెలియాలంటే 'షో' ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.