పవన్ అనగానే అందరికి ఎందుకు ఆ పునకాలు!!

P.Nishanth Kumar
పవన్ తో సినిమా అనగానే ప్రతి ఒక్కరికి ఏదో తెలియని పూనకం వస్తుంది కాబోలు. అన్ని విభాగాలలో పనిచేసేవారు పవన్ సినిమా అనగానే ఎంతో ఉత్సాహంతో పని చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తో పని చేయడం గొప్ప విషయమే అయినా కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేస్తూ నిత్యం వారి తో ఉండే వారు కూడా పవన్ సినిమా అనగానే ఎక్కడలేని శ్రద్ధ వహిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తో పనిచేస్తే ఆటోమేటిగ్ గా ఉత్సాహం శ్రద్ధ వస్తాయనేది వారు చెబుతున్న మాట.


ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ తో వరుస సినిమాలు చేస్తూ వారి అభిమానులకు మ్యూజిక్ ట్రీట్ ను అందిస్తున్నాడు తమన్. ఆయన తొలి సారి పవన్ కు సంగీతం అందించిన వకీల్ సాబ్ సినిమా ఆల్బం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన టీజర్ విడుదల అయినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ కు పవన్ అభిమానులు తమన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పాట తర్వాత తమ గురించి ఏమని చెప్పాలో కూడా ప్రేక్షకులకు అభిమానులకు అర్థం కావడం లేదట.

పవన్ సినిమా అనగానే అందరికీ ఎందుకు పూనకాలు వస్తాయో తెలియదు గానీ తమ లో దాగున్న బెస్ట్ టాలెంట్ ని వారు నిరూపించుకుంటూ ఉంటారు. ఆ విధంగా గా తమన్ భీమ్లా నాయక్ సినిమాకి సంగీతం అందించిన మొదటి పాట ఈరోజు విడుదల కాగా ఆ పాట విన్న ప్రతి ఒక్కరు తమన్ ను ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు. అందరు హీరోలకు సంగీతం అందిస్తూ తన బెస్ట్ అవుట్ పుట్ ను ఇస్తున్న తమన్ పవన్ అనే సరికి అంతకుమించిన సంగీతాన్ని అందిస్తున్నాడు అనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆ పాట కొన్ని గంటల వ్యవధిలోనే కోటి వ్యూస్ అందుకోవడం విశేషం. మరి తమన్ ప్రభంజనం ఇదే విధంగా గా ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: