
అక్కినేని చివరిరోజుల గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చిన కాదంబరి కిరణ్ !
అక్కినేని నాగేశ్వరరావు చనిపోయి సంవత్సరాలు గడిచిపోయినా ఆయనను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు మరిచిపోలేరు. 90 సంవత్సరాలు జీవించడమే కాకుండా 75 సంవత్సరాలు నటుడుగా కొనసాగి చివరి నిముషం వరకు సినిమాలలో నటించిన ఘనత ఆయన సొంతం.
అక్కినేని తన చివరి రోజులలో క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చివరి రోజులలో ఆయన ఎవర్ని కలవడానికి ఇష్టపడలేదు కదా కనీసం ఎవరికీ ఫోన్స్ కు కూడ అందుబాటులో ఉండేవారు కాదు అని అంటారు. ఆయన చివరి రోజులలో ఆయన ఉండే గదిలోకి ఆయన కుటుంబ సభ్యులు తప్ప మరెవ్వరు వెళ్ళేవారు కాదట.
అయితే నటుడు కాదంబరి కిరణ్ అక్కినేనితో తనకు ఉన్న సాన్నిహిత్యంతో ఆయన చివరి రోజులలో తరుచు ఆయన ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడట. అక్కినేని తో ‘మట్టిమనిషి’ అన్న సీరియల్ కాదంబరి కిరణ్ తీసాడు. ఆ సీరియల్ పెద్దగా సక్సస్ కాకపోవడంతో ఆ సీరియల్ వల్ల కాదంబరి కిరణ్ కు వచ్చిన సమస్యలను అక్కినేని పరిష్కరించారు అని కూడ అంటారు. అంతేకాదు అక్కినేని చేసిన సహాయం వల్లనే తాను బ్రతికాను అని కాదంబరి కిరణ్ చెపుతూ ఉంటాడు.
ఇక చివరి రోజులలో అక్కినేని చాల నీరసంగా ఉండటమే కాకుండా మరికొన్ని రోజుల్లో మరణిస్తారనగా ఆయన శరీరం మరీ పలచగా మారిపోయిందని చెప్పాడు ముట్టుకుంటే చర్మం ఊడొచ్చేదంటూ సంచలన నిజలు బయటపెట్టాడు కాదంబరి కిరణ్. వాస్తవానికి అక్కినేని చివరి రోజులలో క్యాన్సర్ సమస్యతో చాల ఇబ్బంది పడ్డారు అని అందరికీ తెలిసినప్పటికీ కాదంబరి కిరణ్ చెప్పిన ఈకొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా మరణం పొందే సమయంలో పడే బాధ ఎవరికైనా హృదయాన్ని కదిలించే విషయాలు. అక్కినేని చనిపోయినా ఆయన నటించిన ‘కీలుగుర్రం’ నుండి ‘మనం’ సినిమా వరకు ఆయన సినిమాలు శాస్వితంగా జీవించి ఉంటాయి