పవన్ కళ్యాణ్.. ఏ వయసులో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో తెలుసా?
మెగా బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ.. తన సినిమాలతో అభిమానులను ఆకట్టుకుని పవర్ స్టార్ గా మారిపోయాడు. అయితే పవన్ కళ్యాణ్ జీవితం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి. ఎందుకంటే.. సినిమాల్లోకి రాకముందు నుంచి ఇక ఇప్పుడు రాజకీయ ప్రస్థానం వరకు పవన్ కళ్యాణ్ తన భావజాలంతో ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పదిమందిలో మాట్లాడాలి అంటే సిగ్గు బిడియం ఉండే పవన్ కళ్యాణ్.. అసలు నోట్లోంచి మాటలే రాని పవన్ కళ్యాణ్.. అన్నయ్య ఒత్తిడితో సినిమాల్లోకి వచ్చారు.
ఇలా సిగ్గు బిడియం ఉండి అసలు మాటలు కూడా బయటకి రాని ఒక వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో అంతకంతకు ఎదుగుతూ ఏకంగా పవర్ స్టార్ గా మారిపోయారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లో స్టార్ హీరో కొనసాగుతున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తరఫున పోరాడుతున్నారు. ఇప్పుడు ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అయితే ఇలాంటి పవన్ కళ్యాణ్ ఒక సమయంలో ఏకంగా సూసైడ్ చేసుకో బోయాడు. పవన్ ఇంటర్ చదువుతున్న సమయంలో పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో స్నేహితులు కాపీ కొట్టమని చెప్పిన పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఎగ్జామ్స్ రాశాడు. కానీ ఆ తర్వాత రిజల్ట్స్ లో పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు గానీ అన్నయ్య చిరంజీవి గాని అసలు మందలించ లేదట. కానీ తన వయస్సు లోనే ఉన్న సచిన్ టెండుల్కర్, విశ్వనాద్ ఆనంద్ లాంటి వాళ్ళు ప్రతిభ కనబరుస్తూ ఉంటే తన జీవితం ఇలా అయిపోయింది ఏంటి అంటూ మనస్థాపం చెంది పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో కుటుంబ సభ్యులు గమనించి పవన్ కళ్యాణ్ ని కాపాడారు. ఇలా పద్దెనిమిదేళ్ళ వయసులో ఆత్మహత్యాయత్నం చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాల్లోకి రావాలి అంటూ అన్నయ్య ఇచ్చిన సలహాతో వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ గా మారిపోయాడు.