అమ్మో ఒకటో తారీకు వచ్చేసిందిగా ..?

Divya
మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వారు ఎలా ఉంటారు అంటే..? వారికి ఆశలు చాలానే ఉంటాయి.. కానీ ఆశలు చంపుకోలేక, వారు కన్న కలను నెరవేర్చుకునే లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొంతమంది ఆత్మగౌరవాన్ని చంపుకోలేక సమాజంలో నలుగురితో సమానంగా బతకాలనే ఆలోచనతో.. ఎప్పుడు సతమతమవుతుంటారు. ఒకటో తారీకు వచ్చింది అంటే చాలు పాల బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి బిల్లు.. ఇలా అన్ని ఒకేసారి వచ్చిపడతాయి. ఇంట్లో ఉన్న నలుగురు నాలుగు చేతులు వేస్తేనే , ఇవన్నీ కట్టగలరు.. కానీ సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అయితే వారి పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయాన్ని చక్కగా చూపించారు ఈవీవీ సత్యనారాయణ..
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2000వ సంవత్సరంలో "అమ్మో ..! ఒకటో తారీకు" అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇందులో  శ్రీకాంత్, రాశి ,సురేష్ ,సూర్య, ప్రేమ, ఎల్.బి.శ్రీరామ్, కోట శ్రీనివాసరావు వంటి ఎంతోమంది స్టార్ నటీనటులు నటించి, ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబాల అవస్థలు ఎలా ఉంటాయో ..? చక్కగా తెరకెక్కించారు.. ముఖ్యంగా ఈ సినిమా చూస్తే మధ్య తరగతి కుటుంబాల ప్రజలు , ఇంత సమస్యలను ఎదుర్కొంటారా.. ? వీరు ఇళ్లల్లో ఇన్ని సమస్యలు ఉంటాయా..? అని ఆశ్చర్య పోక తప్పదు. ఉన్నత కుటుంబాలలో పుట్టిన వారికి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
పేదరికంలో పుట్టిన వాడికి ఆశలు ఉండవు.. ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణం ఉంటుంది . కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారు మాత్రం ఎక్కువ సంపాదించలేక, ఎన్నో ఆశలను మనసులో నిలుపుకొని ,నిత్యం సతమతమవుతూ ఉంటారు.. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రంలో ప్రతి నటి నటుడు కూడా తమ తమ పాత్రలలో లీనమై పోయి నటించడం చాలా గొప్ప విశేషం. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో జరిగిన సమస్యలను ఆధారంగా తీసుకొని సినిమా తెరకెక్కించారో ఏమో, అన్నంతగా తెగ బాధపడిపోయారు. మహిళలు అయితే ఏకంగా సినిమా అయిపోయే వరకు కన్నీళ్లు ఆపుకోలేదు..అంతలా  ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేసింది ఈ సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: