వామ్మో.. బుల్లెట్ భాస్కర్ ని చితక్కొట్టిన జబర్దస్త్ నరేష్?

praveen
ప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో రకాల కామెడీ షోస్ ప్రేక్షకులను ప్రతి వారం కూడా అలరిస్తూనే ఉన్నాయి.  ఒకప్పుడు జబర్దస్త్ అనే ఒక కార్యక్రమంలో మాత్రమే కామెడీ ఎంటర్ టైన్ మెంట్ పొందేవారు బుల్లితెర ప్రేక్షకులు. కానీ ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. బుల్లితెర ప్రేక్షకులకు మరింత కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.  అంతేకాదు రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమం కూడా ప్రారంభించి ప్రతి వారం క్రితం ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈటీవీ నిర్వాహకులు.



 రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త కామెడీని పంచుతున్నారు. అంతేకాదు ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొత్త కమెడియన్స్ కి  కూడా అవకాశం కల్పిస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రతి వారం కూడా  ప్రేక్షకులను అలరిస్తుంది ఈ షో. ఇటీవల ఈ షోకి సంబంధించిన ప్రోమో మీడియాలో విడుదలయింది.  ఇక ఈ ప్రోమో లో భాగంగా ఎప్పటిలాగానే కమెడియన్స్ తమదైన శైలిలో కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ ప్రోమోలో ఏకంగా జబర్దస్త్ నరేష్ బుల్లెట్ భాస్కర్ ను  చితక్కొట్టాడు.


 తమిళ్ లో తెలుగులో ఫైటింగ్ సీన్స్ లవ్ ప్రపోజ్ సీన్స్ ఎలా ఉంటాయో చేసి చూపిస్తాం అంటూ జబర్దస్త్ నరేష్ చెబుతాడు.  ఈ క్రమంలోనే ఎంతో రొమాంటిక్గా సింగర్ సాకేత్ పాహిమా కి ప్రపోజ్ చేశాడు. ఇక తమిళ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో అని చూపించడానికి అటు జబర్దస్త్ నరేష్ లుంగీ కట్టుకుని స్టేజ్ మీదకి వస్తాడు.. తమిళ్ లాంగ్వేజ్ లో ఏదో డైలాగ్ చెబుతూ పాహిమా ను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఇద్దరూ కింద పడి పోతారు.  ఆ తర్వాత తమిళ్ లో ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంటాయో చూపిస్తూ ఏకంగా బుల్లెట్ భాస్కర్ ముందు ఎంతో కోపంగా డైలాగ్ చెబుతూ ఇక ఎగిరెగిరి కొడుతూ బుల్లెట్ భాస్కర్ ను కింద పడేసి మరి చితక్కొట్టాడు జబర్దస్త్ నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: