
అల్లు రామలింగయ్య పేరు వెనుక అంత స్టోరీ వుందా..?
అల్లు రామలింగయ్య 1922 వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు అనే గ్రామంలో జన్మించారని సమాచారం. ఇక ఈయన తండ్రి అయిన అల్లు వెంకయ్య మరియు తల్లి సత్యమ్మ దంపతులకు జన్మించారట.ఈయనకు ముగ్గురు అన్నలు మరియు ఇద్దరు తమ్ముళ్లు అలాగే ఒక సోదరి కూడా ఉన్నాడని తెలుస్తుంది. వీరి తాతగారు పాలకొల్లు ప్రాంతంలో పెద్ద ఆస్తిపరులుగా ఉండేవారని తెలుస్తుంది.
ఇకపోతే వీరి తాతగారు ఎన్నో దాన, ధర్మాలు చేయడంతో ఉన్న ఆస్తి మొత్తం కరిగించేశారని తెలుస్తుంది.ఇక అల్లు వెంకయ్య మాత్రం ఎంతో కష్టపడి వ్యవసాయంలోనే చాలా డబ్బును సంపాదించారని సమాచారం.అప్పుడే వీరికి అల్లురామలింగయ్య జన్మించాదట. అల్లు రామలింగయ్య జన్మించడం వలన ఇక వారి ఊరిలో ఉన్న రామలింగేశ్వరస్వామి దయవల్లే వారి ఆస్తి కొంచెం తిరిగి వచ్చిందట. .ఇక అందుకే తమ గ్రామంలో ఉన్న' క్షీర రామలింగేశ్వర స్వామి 'దేవాలయం పేరు గా ఆయనకు అల్లు రామలింగయ్య అని పేరు పెట్టారని సమాచారం.
ఇక అల్లు రామలింగయ్య ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టే వారు కాదట. తమ ఊరిలో ఎవరైనా భార్య, భర్త నాటకాలు వేస్తే , వారి వెనక వెళ్లి.. నేను కూడా వేస్తాను అని చెప్పి వెళ్లేవారని సమాచారం.
అలా నాటకాల వారిని వెంటపడి అల్లు రామలింగయ్య విసిగించడంతో 3 రూపాయలు ఇస్తే భక్త ప్రహ్లాద నాటకంలో ఒక పాత్ర వేయిస్తాం అని చ ఆ నాటకాలు డైరెక్టర్ చెప్పారని సమాచారం. తమ ఇంట్లో వారికి తెలియకుండా వారి ఇంట్లో ఉన్న బియ్యాన్ని అమ్మి, మూడు రూపాయలు ఆ నాటకాల మేనేజర్ కు ఇచ్చాడని సమాచారం . అలా ఆ నాటకాల నుంచి తన నటనా జీవితాన్ని ప్రారంభించాడట అల్లు రామలింగయ్య.