మొన్నే రిలీజ్.. సినిమా చూడొద్దని పోస్ట్ పెట్టిన డైరెక్టర్!!

P.Nishanth Kumar
ఎంతో కష్టపడి సంవత్సరాలకు సంవత్సరాలు సినిమా చేసి థియేటర్లలో సినిమా నీ విడుదల చేస్తారు దర్శక నిర్మాతలు. ఒక సినిమా విడుదల అయితే తల్లి బిడ్డను ప్రసవించిన ఆనందపడతారు చిత్ర చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ. అలాంటి సినిమా ను ఎవరు చూడొద్దు అని ప్రచారం చేసుకోరు. ముఖ్యంగా దర్శకనిర్మాతలు తమ సినిమా ను చూడొద్దని ప్రచారం చేసుకోరు.పుట్టగానే బిడ్డను చంపినట్లుగా తాజాగా ఈ శుక్రవారం విడుదలైన ఓ సినిమా విషయంలో ఇదే జరిగింది. సాక్షాత్తు ఆ చిత్ర దర్శకుడు తన సినిమాను చూడొద్దని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు.

మరి ఆ దర్శకుడు ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది నిర్మాతకు ఆయనకు ఏదైనా ఇబ్బంది కలిగించాడా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమన్షి, కావ్య సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సూర్యాస్తమయం. శ్రీహరి సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ కుమార్ దర్శకత్వంలో క్రాంతికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రేక్షకులకు ఈ సినిమా ఒకటి ఉందని తెలియజేసే విధంగా ప్రమోషన్స్ నిర్వహించి ఈ శుక్రవారమే సినిమాను విడుదల చేశారు. అయితే విడుదలైన ఒక్కరోజులోనే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

ఓ ప్రెస్ మీట్ నిర్వహించి దర్శకుడు చేసిన పనిని ఆయన పద్ధతి ఏమీ బాగోలేదు అని విమర్శించారు నిర్మాత. బండి సరోజ్ కుమార్ తన ఫేస్ బుక్ పేజీలో తను డైరెక్ట్ చేసిన సినిమా ను చూడవద్దని పోస్ట్ పెట్టడం ఈ సినిమాపై భారీ ఎఫెక్ట్ పడుతుందని ఆయన వెల్లడించారు. సూర్యాస్తమయం సినిమాలో తాను నటించిన కొన్నిటిని కావాలనే డిలీట్ చేశారని దర్శకుడు నిర్మాతలపై చేసిన ఆరోపణలు. వాళ్లపై కేసు పెడతా అని తన క్రియేటివ్ రైట్స్ ని ఉల్లంఘించినందుకు వదిలేది  లేదని అన్నారు. ఎలాంటి నోటీసు లేకుండానే ఈ విధంగా చేయడం ఏంటని ఆయన వెల్లడించారు. అలాగే థియేటర్స్ లో ఏ సినిమా చూడవద్దని తిరిగి క్లారిటీ వచ్చే దాకా వెయిట్ చేయమని కోరారు సరోజ్ కుమార్. ఏదేమైనా ఆ నిర్మాత చిన్న సినిమా చేయడం రిలీజ్ చేయడం చాలా కష్టమని అయినా తాము ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేసి ఫలితం కోసం ఎదురు చూశామని ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు సినిమా చూడవద్దు అని పోస్ట్ పెట్టడం ఎంతవరకు భావ్యము అని ఆయన అన్నారు. సినిమా చాలా బాగుంటుందని నమ్మి ఈ సినిమాను విడుదల చేస్తామని సక్సెస్ మీట్ పెట్టాల్సిన టైంలో ఇలాంటి ఆరోపణలతో మీడియా ముందుకు రావడం చాలా బాధగా ఉంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: