'ఆదిపురుష్' కంటే ముందు ప్రభాస్ పౌరాణిక పాత్ర పోషించిన సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సరికొత్త కథలతో వరుస సినిమాలను ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే.అందులో 'ఆదిపురుష్' సినిమా కూడా ఒకటి. ప్రభాస్ తన కెరీర్ లో మొదటి సారి పౌరాణిక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రామాయణ ఇతిహాసాల ఆధారంగా రూపొందుతుంది. ప్రభాస్ ఈ సినిమాలో శ్రీ రాముడిగా కనిపించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇక ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.అయితే ఇదిలా ఉంటె ప్రభాస్ తన కెరీర్లో ఆదిపురుష్ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్రలో నటించారు.ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..


ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తెలుగు అగ్ర నటులలో ఒకరన్న విషయం తెలిసిందే.ఇక తండ్రి సూర్యనారాయణ రాజు నిర్మాత.అయితే ప్రభాస్ కి తన చదువు పూర్తి అవ్వగానే సడెన్ గా హీరో అవ్వాలని అనిపించిందట.ఇంట్లో ఈ విషయం చెప్తే అందరూ ఆశ్చర్య పోయారట.యాక్ట్ చేయాలని ఉంటే నటనలో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖ లోని సత్యానంద్ దగ్గరకు పంపించారట.అలా శిక్షణ తీసుకుంటున్న టైమ్ లో ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేద్దామని అన్నారు.ముందు ఓకే చేయలేదు. అయితే ఆ తర్వాత కృష్ణంరాజు జోక్యం చేసుకోవడంతో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో 'ఈశ్వర్' సినిమా చేసాడు ప్రభాస్.అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.


అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'యమదొంగ' సినిమాను విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ లో తీసారు.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏదైనా చేద్దామని అనుకున్నారు రాజమౌళి.అప్పుడు ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించారు.అయితే ముందు నేనేంటి విశ్వామిత్రుడి వేషం ఏంటని అనుకున్నాడట ప్రభాస్.కానీ జక్కన్న కన్విన్స్ చేయడంతో విశ్వామిత్రుడి వేషం వేయడానికి ఒప్పుకున్నాడట.అంటే ఆదిపురుష్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ' సినిమాలో కేవలం ఒకే ఒక సన్నివేశం కోసం అదికూడా టైటిల్ కార్డ్స్ లో విశ్వామిత్రుడి వేషంలో కనిపించి అలరించాడు ప్రభాస్.ఇక ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియకపోవడం గమనార్హం.ఇక ఇప్పుడు ఆదిపురుష్ తో శ్రీరాముడిగా పూర్తి స్థాయి పాత్రలో అలరించబోతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: