కళకళలాడి పోయిన క్యాష్ స్టేజ్.. ఎందుకో మీరే చూడండి?

praveen
ఏదైనా షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది అంటే చాలు అటు బుల్లితెర ప్రేక్షకులకు ఏ రేంజిలో ఎంటర్టైన్మెంట్ అందుతుందో అందరికీ తెలిసిందే.  ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది.  యాంకరింగ్ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.  ఒకప్పుడు స్టార్ మహిళ అనే కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సుమ ఇక ఇప్పుడు లేటెస్ట్ గా క్యాష్ అనే కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనే విషయం తెలిసిందే.


 ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాల్లో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న వాటిలో సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాషో కూడా ఒకటి.  క్యాష్ షో లో ప్రతీ వారం కూడా నలుగురు కొత్త గెస్ట్ లను పిలిచి వారితో వివిధ రకాల ఫన్నీ టాస్క్ లు చేయిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది యాంకర్ సుమ.  ఇకపోతే ఇటీవల వచ్చేవారం క్యాష్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదల వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా క్యాష్ స్టేజ్ మొత్తం కళకళలాడి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఎందుకు అంటే ఒకప్పుడు హీరోయిన్ లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో అలరించిన వారిని ఇటీవలే స్పెషల్ గెస్ట్ లుగా ఆహ్వానించింది యాంకర్ సుమ.  ఈ క్రమంలోనే ఒకప్పుడు ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాసీ..  కోర చూపుల తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన మహేశ్వరి.. వెళ్లవయ్యా వెళ్ళు అంటూ తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైనా సదా..  ఎన్నో తెలుగు సినిమాల్లో అలరించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రద్దాదాస్. ఈ నలుగురు హీరోయిన్లు గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరితో స్పెషల్ టాస్క్ లు చేయించిన యాంకర్ సుమ మరోసారి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: