బలవంతంగా సెక్స్ వృత్తిలో వెళ్లిన అమ్మాయి ఏమైంది..?

NAGARJUNA NAKKA
బాలీవుడ్ మూవీ సంజయ్ లీలా భన్సాలి, ఆలియా భట్‌ కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం 'గంగూభాయ్ కఠియావాడి'. ట్రైలర్‌తోనే ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఆలియా గ్యాంగ్‌స్టర్ పాత్రతో సర్‌ప్రైజ్ చేసిందనే ప్రశంసలు కూడా వచ్చాయి.  పాజిటివ్‌ వైబ్రేషన్స్ తోనే జులై 30న విడుదలకు సిద్ధంగా ఉంది 'గంగూభాయ్' చిత్రం. అయితే కరోనాతో ఈ మూవీ విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.  

ముంబయి కమాఠిపురా ప్రాంతాన్ని రూల్‌ చేసిన గంగూభాయ్‌ కథాంశంతో రూపొందింది 'గంగూభాయ్ కఠియావాడి'. బలవంతంగా వేశ్యవృత్తిలోకి నెట్టబడిని ఒక అమ్మాయి, కమాఠిపురా ఏరియాని ఎలా చేతుల్లోకి తీసుకుందనే కథాంశంతో వచ్చిందీ సినిమా. అయితే ఈ మూవీలో గంగూభాయ్ పాత్రని తప్పుగా చూపిస్తున్నారని కోర్టుకి వెళ్లాడు గంగూభాయ్ కొడుకు బాబూజీ షా. గంగూభాయ్ కఠియావాడి దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలి, హీరోయిన్‌ ఆలియా భట్‌కి నోటీసులు జారీ చేసింది ముంబాయి హై కోర్టు. అలాగే ది 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' నవల రాసిన హుస్సేన్ ఖైదీకి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసుని సెప్టెంబర్‌ 7వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 'పద్మావత్' సినిమా సమయంలో కూడా రాజపుత్ సంఘాలు గొడవలు చేశాయి. రాణి పద్మావతి దేవిని కించపరిచే సన్నివేశాలున్నాయని, వాటిని తీసెయ్యకపోతే దీపిక పదుకొణే ముక్కు కోస్తామని, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని చంపేస్తామని వార్నింగ్స్ ఇచ్చారు. దీంతో 'పద్మావతి' టైటిల్‌ని 'పద్మావత్‌'గా మార్చి సినిమా రిలీజ్ చేశాడు భన్సాలి.  


పీరియాడికల్‌ డ్రామాస్‌ తెరకెక్కించడంలో భన్సాలి ఎక్స్‌పర్ట్. అయితే చరిత్రని సినిమాటిక్‌గా మార్చినప్పుడు ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్‌ కూడా యాడ్ చేస్తుంటారు. ఈ అంశాలే వివాదాలకు కారణమవుతుంటాయి. మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళనలు, కోర్టు కేసులు స్టార్ట్ అవుతాయి. సంజయ్‌ లీలా భన్సాలి చిత్రాలన్నీ వివాదాల్లో ఇరుక్కోవడంతో.. ఈ దర్శకుడు కావాలనే ఇలా చేస్తున్నాడా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: