ముగ్గురు హీరో ల హ్యాండ్ సుధీర్ బాబు కి కలిసి వచ్చేనా!!

P.Nishanth Kumar
సుధీర్ బాబు ఆనంది హీరో హీరోయిన్లుగా కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ జిల్లా శశి దేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈరోజు విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. సుధీర్ బాబు గత కొన్ని సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఈ సినిమాతో ఎలాగైనా ఆకట్టుకొని తన ఖాతాలో హిట్ వేసుకోవాలని భావించి ఓ వెరైటీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేయడంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా పాటలు ట్రైలర్ సినిమా పై మంచి అభిప్రాయం వచ్చేలా చేశాయి. అదే విధంగా ముగ్గురు స్టార్ హీరోలు ఈ సినిమాకు తమ వంతు గా ప్రమోషన్ చేయడంతో ఈ సినిమా అందరికీ చేరువ అయ్యిందని చెప్పవచ్చు. మొదట ఈ చిత్ర ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయగా మహేష్ అభిమానులందరికీ ఈ ట్రైలర్ ఎంతగానో నచ్చింది.

ఆ తర్వాత ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేశారు. ఇంటర్వ్యూ నిర్వహించి ప్రేక్షకులకు ఈ సినిమా విశేషాలు తెలియజేశారు. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాకు తన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరొక ట్రైలర్ ను ఆయన విడుదల చేశారు. మొత్తానికి ఈ ముగ్గురు హీరోల సపోర్టుతో ఈ చిత్రానికి రావలసిన పబ్లిసిటీ వచ్చింది.  ఓ మర్డర్ కేసులో సెంట్రల్ జైలుకు అడుగుపెట్టే హీరో యొక్క జీవితమే ఈ సినిమా కథ. ఒక ఊరిలో శ్రీదేవి ప్రేమించే హీరో వీరి పెళ్లికి కులం అడ్డు వస్తుంది ఆ తరువాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తి కర అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: