ఎక్కడున్నా అది కంపల్సరి.. అనుపమ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమా 'ప్రేమమ్' తో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు ఇతర భాషల నుండి కూడా వరుస ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే  త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ బ్యూటీ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే ఈ హాట్ బ్యూటీ హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.


 అయితే అసలు విషయానికి వస్తే ఈ మధ్య దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అనుపమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అనుపమ చేసిన పనులు తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈవెంట్ బిజీగా జరుగుతున్న సమయంలో అనుపమ తన అసిస్టెంటు ను పిలిచి ఫోన్ తీసుకురా అని అడిగింది, ఆ తర్వాత ఫోన్ లో అప్డేట్ లను చెక్ చేసుకుంది. ఫోన్ లేకుండా చాలామంది బ్రతక లేక పోతున్నారు. మనుషుల కంటే ఎక్కువ ఫోన్ తోటి గడపడానికే చాలామంది ఇష్టపడుతున్నారు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా కేవలం వారికి ఫోనే ప్రపంచంల మారిపోయింది. అంటూ అనుపమ వీడియోను మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అనుపమ ఈ వీడియోపై స్పందించింది. ఈ వీడియోలో అనుపమ ఫోన్ తీసుకురా అనడం , ఆ తర్వాత ఫోన్ లో మునిగి పోయినట్లు కనిపిస్తోంది. అయ్యో దొరికిపోయానే అన్నట్టు తాజాగా అనుపమ స్పందించండి. ప్రస్తుతం అనుపమ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజీస్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: