చరణ్ కి దెబ్బ పడేలా ఉందే ... ??

GVK Writings
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నేడు ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసారు. కొన్ని పికప్ షాట్స్ మినహాయించి దాదాపుగా మూడేళ్ళ తరువాత ఈ మూవీ ఎట్టకేలకు పూర్తి అవడంతో దీని విడుదల కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమా ని డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ తీయనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు చరణ్. ఇటీవల అఫీషియల్ గా ప్రకటించబడ్డ ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేయనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మంచి మెసేజ్ తో కూడిన భారీ కమర్షియల్ సినిమాగా అదిరిపోయే విజువల్స్ తో దర్శకుడు శంకర్ ఈ సినిమా తీయనున్నట్లు టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇటీవల కమల్ తో శంకర్ తీస్తున్న ఇండియన్ 2 మూవీ షూట్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో దానిని మళ్ళీ పునఃప్రారంభించేలా దర్శకుడు నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో ఉన్న కమల్, వీలైనంత త్వరలో దానిని పట్టాలెక్కించి ఆపై రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారట.

అయితే ఒకవేళ ఆ సినిమా కనుక త్వరలో ప్రారంభం అయిన పక్షంలో చరణ్ సినిమాని శంకర్ కొన్నాళ్ల పాటు వాయిదా వేయక తప్పదని అంటున్నాయి సినిమా వర్గాలు. కాగా ఇప్పటివరకు ఇండియన్ 2 అఫీషియల్ గా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై క్లారిటీ రాలేదని, ఒకవేళ వస్తే దానిని బట్టి అటు కమల్, ఇటు చరణ్ సినిమాల షూటింగ్స్ రెండూ కూడా పక్కాగా పూర్తి చేసేలా శంకర్ ఇప్పటినుండే రెడీ అవుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపినట్లు సమాచారం. మొత్తంగా మరి ఈ రెండు సినిమాల విషయమై ఏమి జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే .... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: