పుష్ప మేకప్ తో బన్నీ అంత కష్టపడుతున్నాడా...?
అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడని సమాచారం.ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాలో ఊరమాస్‌గా బన్నీ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మోరటైన పాత్ర కోసం అద్భుతమైన లుక్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడని సమాచారం. ఇందులో క్రూరమైన ఎర్రచందనం స్మగ్లర్ గా బన్ని నటిస్తున్నాడట. ఇప్పటికే ఆయనకు సంబంధించిన లుక్స్ విడుదల కాగా, అవి ఎంత క్రూరంగా ఉన్నాయో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .
పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ ప్రతి రోజు సుమారు రెండు గంటలు మేకప్ వేసుకునే వారని తెలుస్తుంది. రింగులజుట్టు మరియు దానికి తగ్గ గడ్డం అలాగే షేపులు పోయిన అతి ముదురు గెటప్ కోసం తను టచ్ అప్ లు చేయించుకుంటున్నాడని సమాచారం.అల్లు అర్జున్ మేకప్ వేసుకోవడానికి రోజుకు సుమారు రెండు గంటలు సమయం తీసుకుంటున్నాడట. అలాగే మేకప్ ని తొలగించడానికి ఒక గంట సమయం ప్రతిరోజూ కేటాయిస్తున్నాడని వార్త వినిపిస్తుంది. అల్లు అర్జున్ కు సినిమాపై గౌరవంపై ప్రశంసల వెల్లువ కురుస్తుందని సమాచారం. పుష్ప పార్ట్ 1 క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా విడుదలయి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి...