ఇండియన్ 2 పై ఇంకా ఆశలు ఉన్నాయా.. కమల్..!!

P.Nishanth Kumar
సుమారు 25 సంవత్సరాల క్రితం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయుడు అప్పట్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తమిళనాట తెరకెక్కిన ఈ సినిమా అక్కడే కాదు దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  శంకర్ కి కూడా ఆ సినిమా గొప్ప పేరును తీసుకొచ్చింది.  దాంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని భావించినా శంకర్ కమల్ హసన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించడం మొదలుపెట్టాడు.

అయితే ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి ఏదో ఒక అవరోధం సినిమా షూటింగ్ కు అడ్డు అడ్డు తగులుతుంది. మొదటగా ఈ సినిమా షూటింగ్ సమయంలో క్రేన్ యాక్సిడెంట్ ఈ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది. అంతేకాకుండా ఈ సినిమా ఆర్థిక సమస్యలలో చిక్కుకోవడం దర్శకుడికి నిర్మాతలకు [పడకపోవడం వంటివి శంకర్ ఈ సినిమాను మధ్యలో  వదిలి వెళ్లి పోవడానికి కారణాలు అయ్యాయి

ఫలితంగా శంకర్ ఈ సినిమాను పక్కన పెట్టి టాలీవుడ్ లో రామ్ చరణ్ తో ఒక సినిమాని బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ చిత్రాన్ని చేస్తున్నాడు. వీటిలో ముందు గా రామ్ చరణ్ సినిమా ను పూర్తి చేయనున్నాడు. సెప్టెంబర్ లో .ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.   అయితే భారతీయుడు సినిమా సీక్వెల్ చూడాలనుకున్న అభిమానులకు ఆ సినిమా లేనట్లేనా అని ఒక బాధ వారిలో ఉండగా స్వయంగా ఈ సినిమా గురించి నోరు విప్పాడు హీరో కమల్ హాసన్. ఈ  సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా మధ్య మధ్యలో జరుగుతున్న గొడవలు నేను తగ్గించుకుంటూ వస్తున్నాను త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతామని చెప్పడంతో ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: