"భీమ్లా నాయక్" లో తమిళ భామ ?

VAMSI
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానాలు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం "భీమ్లా నాయక్". పేరుకి "అయ్యప్పనుం కోషియం" మలయాళ చిత్ర రీమిక్ అయినా మెయిన్ లైన్ చెక్కు చెదరకుండా.. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని కథలో చాలా మార్పులు చేసినట్లు కథనాలు వినబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో న్యూస్ ఈ సినిమాకి మరింత హైప్ పెంచేయడమే కాదు. ఆడియన్స్ ని తెగ ఊరిస్తోంది. ఈ సినిమాకు ఇంకాస్త గ్లామర్ ని జోడించే దిశగా ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందని ఆ పాటలో పవన్ తో స్టెప్పులు వేసే అందాల తార శృతిహాసనే అంటూ తాజా వార్తలు చెబుతున్నాయి.

ఈ మూవీలో  స్పెషల్ సాంగ్ చేయడానికి శృతి హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన పవర్ ను చూపించిన 'గబ్బర్ సింగ్' మూవీ జోడీ ఇపుడు ఇన్నాళ్లకు మరోసారి జత కట్టనుంది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ సూపర్ హిట్ కాంబోకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇపుడు మరోసారి అదే మ్యాజిక్ ని క్రియేట్ చేసేందుకు ఈ పెయిర్ మన ముందుకు వస్తున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శృతి హాసన్ పవర్ స్టార్ వరుస చిత్రాల్లో నటించి అలరిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ కల నెరవేరలేదు.

కానీ ఇన్నాళ్టికి మళ్ళీ వీరిద్దరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫ్యాన్స్ ను సంతోషంతో ముంచెత్తుతున్నాయి. ఈ వార్త నిజమవ్వాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. అయితే త్వరలో ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. థర్టీ ప్లస్ వయసులో కూడా తన హవా చాటుతూ వెండి తెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ తన క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటున్న ఈ అందాల తార భీమ్లా నాయక్ సినిమాలో స్టెప్పులు వేస్తుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమా నుండి విడుదలయిన భీమ్లా నాయక్ టీజర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. పైగా రానా పాత్ర ఇందులో చూపకపోవడంతో ట్రోల్స్ దారుణంగా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: