మెహర్ రమేష్ దర్శకత్వంలో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఆచార్య
సినిమా తరువాత
మెహర్ రమేష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల ఈ
సినిమా ఒకటి. చాలా రోజుల తర్వాత మెహర్ మెగాఫోన్ పట్టుకుని చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో భారీ ఫ్లాప్ లను అందుకున్న కూడా
మెగాస్టార్ చిరంజీవి ఆయనపై మరొకసారి నమ్మకం ఉంచి ఈ
సినిమా అవకాశం ఇచ్చాడు. దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈయన
రీమేక్ సబ్జెక్టును ఎంచుకోవడం విశేషం.
తమిళంలో
అజిత్ హీరోగా నటించిన వేదళం సినిమాను తెలుగులో భోళా
శంకర్ గా
రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలకంగా వచ్చే
హీరో చెల్లెలి పాత్ర కోసం
కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు అంతకు ముందు చాలా మంది హీరోయిన్ల పేర్లు ను పరిశీలించినా చివరకు చెల్లెలుగా ఎంపిక చేశారు. ఈ పాత్ర కోసం
కీర్తి సురేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమని కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు
కీర్తి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ
బ్యూటీ పాత్రలతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో
మెగాస్టార్ చెల్లి గా నటిస్తున్న ఈ
సినిమా తనకు ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందో అని ఆమె భావిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సర్కారు వారి పాట
సినిమా ఉంది. ఈ చిత్రంలో ఆమె
హీరోయిన్ గా నటిస్తుంది. గ్లామర్ పాత్ర కాకపోయినా కొంత ప్రేక్షకులను అలరించే పాత్రలోనే ఆమె నటిస్తుంది. అంతే కాదు మరికొన్ని అగ్ర హీరోల సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈమె ఈ పాత్ర చేయడం ఆ సినిమాల పై ఎలాంటి ఎఫెక్ట్ఉంటుందో అని సి నీ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ప్రతి
సినిమా కోసం రెండు కోట్లకు పైగానే పారితోషకం తీసుకునే
కీర్తి సురేష్ ఈ
సినిమా కోసం మూడు కోట్ల దాకా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.