'భీమ్లా నాయక్' టీజర్ మంటకి ఆయింట్ మెంట్ రెడీ అవుతోందట..!!

Anilkumar
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి టైటిల్ తో పాటూ ఓ చిన్న టీజర్ గ్లిమ్స్ విడుదలైన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకి భీమ్లా నాయక్ అనే టైటిల్ తో కేవలం పవన్ కి సంబంధించిన టీజర్ నమాత్రమే విడుదల చేసారు.దీంతో మల్టీస్టారర్ సినిమాని సోలో స్టారర్ సినిమాగా మార్చేస్తున్నారనే టాక్ ఆడియన్స్ లో మొదలయ్యింది.సినిమాలో రానా పాత్రని హైలైట్ చేయడం లేదని,కేవలం పవన్ కళ్యాణ్ పాత్రని మాత్రమే హైలెట్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇక అందుకు తగ్గట్టే భీమ్ నాయక్ గ్లిమ్స్ లో రానా ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు.


దీంతో ఒకవైపు రానా అభిమానులు, మరోసారి సినిమా ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో ఈ టీజర్ రాజేసిన మంట ఇంకా చల్లారలేదనే చెప్పాలి.అయితే ఇప్పుడు ఆ మంటను చల్లార్చడానికి ఆయింట్ మెంట్ ను రెడీ చేయిస్తోందట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.నిజానికి భీమ్లా నాయక్ టీజర్ వీడియో విడుదలైన రోజే..ఈ చిత్ర నిర్మాత అయిన నాగవంశీ ఓ నెటిజన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు.'అప్పుడే నిర్ణయానికి వచ్చేయొద్దు..అన్నీ ఓ లెక్క ప్రకారం జరుగుతాయి' అని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు.అందుకు తగ్గట్టే రానా పాత్ర అయిన డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించిఓ వీడియో రెడీ అవుతుందట.


అంతేకాదు త్వరలోనే ఆ వీడియోని కూడా విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వారంలో రానా పాత్రకు సంబంధించిన వీడియో వస్తుందట.ఇక మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనున్ కోషియం సినిమాకి ఇది రిమేక్ గా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కి ఇద్దరు హీరోల పేర్లు కలిసి వచ్చేలా టైటిల్ పెట్టారు.మరి తెలుగులో చూస్తే ఒక హీరో పేరు వచ్చేలా టైటిల్ పెట్టారు.ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్.అదే పేరును సినిమాకి టైటిల్ గా ఫిక్స్ చేయడంతో ఇది మల్టీస్టారర్ సినిమా కాదనే చర్చలు మొదలయ్యాయి.ఇక అలాంటి చర్చలు, ఇకపై రాకూడదనే.. అభిమానులను కూల్ చేసే ప్రయత్నం లోనే సితార నిర్మాతలు ఆయింట్ మెంట్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: