వనిత తల్లి మంజుల ఎలా చనిపోయారో తెలుసా..?

Anilkumar
దేవి సినిమాతో తెలుగు ఇండ్రస్టీ కి హీరోయిన్ గా అడుగుపెట్టింది వనితా విజయ్ కుమార్. మొదటి సినిమాతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.కానీ తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ గామంచి పేరును సంపాదించుకుంది.ఇక తాజాగా ఈమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'తన అసలు పేరు నాగలక్ష్మి మహేశ్వరి వనిత అని చెప్పింది.తెలుగులో దేవి సినిమా కథతనకు బాగా నచ్చడంతో ఆ సినిమాలో నటించానని తెలిపింది.తెలిపారు.


ఇక వనితా తల్లి గారి విషయానికొస్తే.. వీళ్ళ అమ్మగారు ఎవరో కాదు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ప్రఖ్యాత నటిగా పేరొందిన మంజుల గారు.అయితే తన తల్లి గురించి కూడా చెప్తూ.. అమ్మ చనిపోయే రెండు సంవత్సరాల ముందు తాను విడాకులు తీసుకున్నానని,అమ్మ 59 సంవత్సరాల వయస్సులో చనిపోయారని వనితా విజయ్ కుమార్ తెలిపారు.అమ్మ మంజుల ఒకరోజు కింద పడటంతో గాయమైంది.ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో చాలా పెద్ద ప్రాబ్లమ్ అయ్యిందని చెప్పుకొచ్చారు వనితా విజయ్ కుమార్.అంతేకాదు డాక్టర్లు మూడు రోజుల్లో అమ్మ చనిపోతుందని చెప్పారని,నాన్న తనను హాస్పిటల్ కి రావద్దని చెప్పినా..


అమ్మ మాత్రం తన పేరును కలవరించడంతో హాస్పిటల్ కి వచ్చానని వెల్లడించారు వనితా.ఇక అమ్మను చేతిలోకి తీసుకోగానే చనిపోయిందని,తన చేతిని ఎప్పుడు చూసుకున్నా కూడా అమ్మే గుర్తుకు వస్తుందని వనిత చెప్పుకొచ్చింది.ఇక నాన్న గారితో తనకు ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని,అయితే నాన్నని చూస్తే ఇప్పటికీ ఎంతో భయపడతానని ఆమె వెల్లడించారు.ఇక ఓ రెండు నెలల క్రితం నాన్న గారికి ఫోన్ చేయగానాతో బాగా మాట్లాడారని తెలిపారు వనితా.ఇక తాను ఎప్పుడూ కూడా ఓపెన్ గా మాట్లాడుతాను కాబట్టే తన చుట్టూ వివాదాలు ఎక్కువగా చుట్టుముడతాయని వెల్లడించారు వనితా.ఇక తెలుగులో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని,ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించాలని ఉందని,తారక్ తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు వనితా విజయ్ కుమార్....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: