అయ్యబాబోయ్.. వర్క్ ఫ్రమ్ హోమ్.. భార్యలు ఇలా అనుకుంటున్నారా?
అంతేకాదు ఒకప్పుడు భర్త ఆఫీస్ కి వెళ్తే ఎంతో జాగ్రత్తగా వంట చేసి బాక్స్ ప్రిపేర్ చేసేది భార్య. కానీ ఇప్పుడు ఇక భర్త కూడా ఇంట్లోనే ఉండడంతో భర్తతో కూడా పని చేయించుకుంటుంది. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటారా.. భర్తలు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో భార్యలు ఎలా ఫీలవుతున్నారు అన్న విషయాన్ని ఇటీవల జబర్దస్త్ రాకెట్ రాఘవ చెప్పేసాడు. ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎంతో మంది నెటిజన్లు ఆకర్షిస్తుంది. జబర్దస్త్ ప్రోమో లో భాగంగా రాకెట్ రాఘవ స్కిట్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇక రాకెట్ రాఘవ స్కిట్ వస్తున్న సమయంలో ఒకప్పుడు వర్క్ ఫ్రం హోమ్ రాకముందు ఇక ఆఫీసుకు వెళ్ళి పని చేసినప్పుడు ఆమ్మో మా భర్త ఆఫీస్ కి వెళ్లి ఏదో పీకే చేస్తున్నాడు అని అనుకొనేది ణా భార్య.. కానీ వర్క్ ఫ్రం హోం వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటే వీడు పీకేది ఇంతేనా అని అనుకుంటుంది అంటూ పంచు వేసాడు రాకెట్ రాఘవ. దీంతో అక్కడున్న వారందరూ పగలబడి నవ్వుకుంటారు. అయితే ఈ డైలాగ్ ప్రస్తుతం ఎంతో మంది భర్తలకు కనెక్ట్ అయింది అని చెప్పాలి. అంతేకాదు ఇక భార్యలు యూట్యూబ్ ఛానల్ పెడితే భర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్లు చూపించాడు రాకెట్ రాఘవ.