యుగానికి ఒక్కడు మూవీ గురించి తెలియని రహస్యం ..?

Divya
టాలీవుడ్ లో తమిళ్ నుంచి రీమేక్ అయిన సినిమా యుగానికి ఒక్కడు. ఈ సినిమాలో హీరో కార్తీక్ తొలి పరిచయం గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇందులో అలనాటి హీరోయిన్ రీమా సేన్, ఆండ్రియా నటించారు. ఇక సినిమా గురించి ఒక ముఖ్య విషయాన్ని ఆ దర్శకుడు తెలియజేశాడు.. ఆ విషయం ఏంటో చూద్దాం.


ఈ సినిమాకు తక్కువ బడ్జెట్ పెట్టినప్పటికీ, ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తుండటంతో.. ఆ దర్శకనిర్మాతలు కేవలం పబ్లిసిటీ కోసమే అలా చెప్పురని "సెల్వరాఘవన్ " ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాని 11 సంవత్సరాల క్రితం నిర్మించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమాని తమిళ్లో " ఆయిరాతిల్ ఒరువన్ "అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

ఈ చిత్రానికి తెలుగులో బాగానే కలెక్షన్ లు వచ్చినా,  తమిళం ఇండస్ట్రీలో మాత్రం అబోవ్ యావరేజ్ గా నిలిచింది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే , భారీ బడ్జెట్ పెట్టడం వల్ల  ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది అని చెప్పారు. కానీ వాస్తవానికి ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ కాలేదని, డైరెక్టర్ సెల్వరాఘవన్ మూడేళ్ల తర్వాత చెప్పుకొచ్చారు. ఈ విషయం విన్న నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రాన్ని 2010లో 18 కోట్ల రూపాయలతోనే తెరకెక్కించామన్నారు. కానీ ఈ సినిమాకు  హైప్ ను పెంచుకునే దాని కోసం భారీ బడ్జెట్ మూవీగా ప్రమోట్ చేసుకున్నారు. అందుచేతనే ఆ సినిమా కి 32 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ  సినిమా తీసిన బడ్జెట్ తో పోల్చుకుంటే.. ఈ సినిమాకు  డబ్బులు ఎక్కువే వచ్చాయి అని చెప్పుకొచ్చాడు దర్శకుడు. కేవలం ఆ సినిమాకి ఎక్కువ బడ్జెట్ చేసి చెప్పడం వల్లే, ఈ సినిమా వసూళ్లు అబోవ్ యావరేజ్ గా నిలిచి సరి పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక అంతే కాకుండా ఈ సినిమాకి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతున్నట్లు దర్శకుడు తెలియజేశారు. ఇక ఇందులో  ధనుష్ హీరోగా నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: