చిరు మూవీలో హీరోయిన్ పాత్రే అసలైన ట్విస్ట్..?
చిరు నటిస్తున్న 153వ చిత్రం ఇది కాగా, ‘గాడ్ ఫాదర్’ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ‘లూసిఫర్’ ఒరిజినల్ ఫిల్మ్‌లో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించగా, కీలకమైన హీరోయిన్ పాత్రను మంజూ వారియర్ పోషించింది. ఈ పాత్రను తెలుగులో నయనతార పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో వివేక్ ఒబరాయ్ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్ పోషించనున్నట్లు తెలుస్తోంది.
చిరు ఈ సినిమా తర్వాత మరో రీమేక్‌లో నటించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ నటించిన ‘వేదాళం’ రీమేక్‌లో మెగాస్టార్ నటించనున్నారు. ఈ ఫిల్మ్‌ను మెహర్ రమేశ్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు చిరు. చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరు సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించగా, చెర్రీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన లాహే లాహే పాట ఇప్పటికే ఈ సినిమాాపై మంచి హైప్ పెంచింది .