సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?
ఇక ఇందులో పలు ఆధారాలకు సంబంధించి దాదాపుగా 3.11 కోట్లు రూపాయలు చెల్లించాలని , నోటీసును విడుదల చేశారు ఆదాయపన్ను శాఖ అధికారులు. అయితే సూర్య వడ్డీ మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో.. హైకోర్టు మాత్రం మీలాంటి స్టార్ హోదాలో ఉన్న సెలబ్రెటీస్ కూడా ఇలా చేస్తే ఎలా.. మీరు ఇతర జనాలకు ఆదర్శంగా ఉండాలని తెలిపిందట. అంతేకాకుండా ఆదాయ పన్ను విధించిన మొత్తం అమౌంట్ ని వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చిందట.
ఇక ఈ విధంగా నోటీసు పంపించిన ఆదాయపన్ను అధికారులకు సహకరించలేదని సదరు అధికారి సూర్య మీద పిటిషన్ వేశారు. అంతే కాకుండా సూర్య హైకోర్టులో పిటిషన్ వేసే ముందు ఆదాయపన్ను శాఖ, అప్లై ట్రిబ్యునల్ అధికారులకు తెలపకపోవడం వంటివి చేశారు. దాంతో సూర్యాకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి భంగపాటు తప్పలేదు
దాంతో చేసేదేమీ ట్రిబ్యునల్ అధికారులు కూడా ఆదాయపన్ను చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసారు. ఈ తీర్పు ఇవ్వడానికి ఆదాయపన్ను శాఖకు దాదాపు 3 సంవత్సరాలు పట్టిందట. ఇక సూర్య 2018లో ఆదాయపన్ను వడ్డీ నుంచి మినహాయించు కోవాలని తన వాదన తెలుపుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. కానీ సూర్యాకు ఆదాయపన్ను శాఖ పూర్తి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని తీర్పు ఇవ్వడంతో షాక్ తగిలినట్లు అయింది సూర్య కు అని చెప్పవచ్చు.