అల్లుడు అదుర్స్ .. : భీమ్లా ఓటూ బన్నీకే !
ఈ సినిమా ఒక వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకోవడం, షూటింగ్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం మరియు ఇందులో అల్లు అర్జున్ వేషధారణ మాట్లాడే స్లాంగ్ ఇవన్నీ కలిపి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మొన్ననే విడుదలయిన "దాక్కో దాక్కో మేక..." సాంగ్ కి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. యూట్యూబ్ లో ట్రేండింగ్ లో నడుస్తోంది. ఈ సినిమాను లెక్కల మాస్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీసుకుని డీల్ చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ మూవీతో బన్నీ మూవీని పోలుస్తూ ట్రోల్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు 'భీమ్లా నాయక్' సినిమా నుండి విడుదలయిన ఒక టీజర్ లో పెద్దగా విషయమేమీ లేకపోవడమేనని తెలుస్తోంది.
ఒరిజినల్ సినిమాలో పాత్రకు ఈ పాత్రకు పెద్దగా సెట్ అవలేదని, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెంచుకువడం కోసమే ఈ టీజర్ అన్నట్లు ఉందని సెటైర్లు పేలుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రానా పాత్రను రివీల్ చేయకపోవడం మరో రచ్చకు తెరలేపింది. ఇలా ఏ విషయంలో చూసుకున్నా బన్నీ పుష్ప మూవీ అందనంత ఎత్తులో ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. త్వరలోనే విడుదల కానున్న పుష్ప మూవీ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం బన్నీ పుష్ప మూవీకే సపోర్ట్ చేస్తుండడం విశేషం. మరి ఆన్ స్క్రీన్ పై ఏమి జరగనుందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.