టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఏకే రీమేక్ సినిమాకు రచయితగా పని చేస్తున్న విషయం తెలిసిందే సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఎంతగానో సందడి మొదలైంది. రానా మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోశియం అనే సినిమాకు రీమేక్. పవన్ కళ్యాణ్ తో ఉన్న మైత్రి దృష్ట్యా త్రివిక్రమ్ ఈ సినిమాకు సంభాషణలు రాయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా త్వరగా పూర్తి చేసి మహేష్ బాబు హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబు తో ఏరి కోరి మరి సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు రాగా అవి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు మహేష్ బాబు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుండడంతో ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ లోపు త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేయమన్నాడు. చాలా రోజుల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే తే.గీ వుడ్ లో కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ తో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట త్రివిక్రమ్. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా అంటున్నారు. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి.