కమెడియన్ అలీ, పవన్ మధ్య ఆ వివాదం ఎందుకు తలెత్తింది..?

Suma Kallamadi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ కమెడియన్ అలీ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. కానీ రాజకీయపరమైన మనస్పర్థలు తలెత్తడం వల్ల వీరిద్దరి స్నేహం చెడింది. నిజానికి పవన్ హీరోగా నటించిన గోకులంలో సీత నుంచి అత్తారింటికి దారేది వరకు అన్ని సినిమాల్లోనూ అలీ నటించారు. అలీ లేనిదే సినిమా చెయ్యకూడదనే అభిప్రాయంలో పవన్ ఉండేవారు. కానీ తరువాత అలీ ఉంటే సినిమా చేయననే నిర్ణయానికి పవన్ ఇచ్చారు. జనసేన పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ అలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారని అప్పట్లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలీ తనకు ఒక మంచి స్నేహితుడు అని తాను భావించానని కానీ అతడు మోసం చేశాడని పవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలీ లాంటి వారి వల్లే జనాలపై బొత్తిగా నమ్మకం పోతుందని పవన్ చేసిన కామెంట్స్ కి అందరూ షాక్ అయ్యారు. అలీ కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకున్నానని కానీ అలీ అవన్నీ మర్చిపోయి తనకి మాటిచ్చి తప్పాడని పవన్ అన్నారు.

దీంతో కోపోద్రిక్తుడైన అలీ ఎవరూ ఊహించని రీతిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ సినిమాల్లో రాకముందే తాను మంచి స్థాయిలో ఉన్నానని.. అతను తనకు చేసిన సాయం ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరడం తన వ్యక్తిగత విషయం అని.. చేరకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ పవన్ పై అసహనం వ్యక్తం చేశారు. దీనితో వీరిద్దరి మధ్య స్నేహబంధం పూర్తిగా చెడిపోయిందని అప్పట్లో అందరూ భావించారు.

కొంతకాలం తర్వాత రాజకీయ విభేదాలను మరిచి మళ్లీ ఈ ఇద్దరూ తమ స్నేహాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ని కలిశానని నటుడు అలీ తెలిపిన విషయం తెలిసిందే. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా ఆయన వెల్లడించారు. పవన్ సినిమాలో తాను నటించే రోజులు త్వరలోనే వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏదిఏమైనా చిరంజీవి అన్నట్లు రాజకీయాలు మనుషులను దూరం చేస్తే.. సినిమాలు మనుషులను దగ్గర చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: