మరొక్కసారి నెంబర్ వన్ గా సూపర్ స్టార్ ... !!

GVK Writings
టాలీవుడ్ కి రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ చిన్న తనయుడు మహేష్, ఆ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు. ఇక అక్కడి నుండి హీరోగా పలు సినిమాలు చేస్తూ కొనసాగిన మహేష్ మధ్యలో కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో పాటు ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. కాగా ఒక్కో సినిమాతో హీరోగా తన స్థాయిని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతున్న సూపర్ స్టార్ ఇటీవల వరుసగా మూడు సక్సెస్ లు కొట్టి కెరీర్ పరంగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు.

ఇక మహేష్ బాబుకి దాదాపుగా అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు అనేకమంది సినిమా ప్రముఖులు, హీరోయిన్స్ లో కూడా  విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తన సినిమాల వరుస విజయాలతో భారీగా పారితోషికాన్ని కూడా తీసుకుంటున్న మహేష్, పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ తనవంతుగా మానవత్వాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో నెంబర్ వన్ హీరో ఎవరు అనే పోల్ పెడితే ఆ భారీ పోటీలో మహేష్ కూడా ఒకరుగా ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

ఇక గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఏ హీరో ఏ రేంజ్ క్రేజ్ తో కొనసాగుతున్నారు అంటూ ప్రముఖ మీడియా మాధ్యమం ఆర్ మ్యాక్స్ మీడియా వారు నిర్వహిస్తున్న సర్వే లో కొన్ని నెలలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సూపర్ స్టార్ గత నెలలో కూడా మరొక్కసారి నెంబర్ వన్ గా నిలిచి గొప్ప రికార్డు సొంతం చేసుకున్నారు. గత కొద్దినెలలుగా మహేష్ నెంబర్ వన్ గా కొనసాగుతుండడంతో మహేష్ క్రేజ్, స్టామినా ఏంటనేది తెలుస్తోందని, రాబోయే రోజుల్లో ఆయన తన సినిమాల సక్సెస్ లతో మరింత భారీగా ఇమేజ్ సొంతం చేసుకోవడం ఖాయం అని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు .... !!  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: