ఉప్పెన బ్యూటీ పై స్టార్ డైరెక్టర్ ఫైర్.. అసలేం జరిగిందంటే..?

Anilkumar
బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి  సౌత్ లోనే  సెన్సేషన్ గా మారింది కృతి శెట్టి.ఉప్పెన సినిమా లో తన యాక్టింగ్ ,డిఫరెంట్ లుక్స్ తో అదరగొట్టింది..అనుకున్న దాని కంటే పెద్ద ఉప్పెన పెద్ద హిట్ కావడం తో ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా కృతి  కి మరో మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు.ఈ సినిమా ఒక తెలుగు లొనే కాకుండా తమిళ భాషలో కూడా తెరకెక్కనుంది.ఈ మధ్యలోనే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసారట.


ఇది ఇలా ఉండగా కృతి పై ఒక రూమర్ కూడా హల్ చల్ చేస్తోంది.కృతి శెట్టి దర్శకుడు లింగుస్వామి కి చాలా కోపాన్ని తెప్పించిందట.సరిగ్గా నటించకపోతే హీరోయిన్స్ ని దర్శకులు మందలిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారి కాలం నుండే ఇది జరుగుతూ వస్తోంది. సినిమాల్లో సరిగ్గా నటించకపోతే  మందలిస్తారు లేదా దండిస్తారు.గతంలో డైరెక్టర్ తేజా పై కూడా ఇలాంటి రూమర్స్  ఉన్నాయి.తేజ అనుకున్న విధంగా సినిమా రావడం కోసం ఏం అయినా చేస్తారట.ఇకపోతే కృతి పై ఒకసారి లింగస్వామి కి తీవ్ర కోపం వచ్చిందట.తన యాక్టింగ్ మీద లింగుస్వామి కి చాలా కోపం వచ్చిందట.


ప్రస్తుతం ఈయన నాజర్, కృతి శెట్టి లపై ఒక చిన్న ఎమోషనల్ సీన్ ని తెరకెక్కిస్తున్నారట. నాజర్ నటన ఎలా ఉంటుందో మనకి తెలిసిందే.కృతి శెట్టి మాత్రం సరైన హావభావాలను పలికించడానికి  చాలానే టేక్స్ తీసుకుంటోందట.దీంతో దర్శకుడికి అది నచ్చడం లేదు.ఇక విసిగిపోయినలింగుస్వామి కృతి మీద చాలా కోప్పడ్డారుట.షూటింగ్ చేసే ముందే అన్ని ప్రాక్టీస్ చేసుకొని ఉండమన్నారట.అయితే ఉప్పెన మూవీ లో మంచి పేరు తెచ్చుకున్న శ్రుతి లింగుస్వామి దగ్గర తన నటనతో మెప్పించలేకపోతోంది.ఇక ఈ సినిమా పై రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ ఇలాంటి మాస్ క్యారెక్టర్ ల  కోసం చాలా ప్రయత్నించాడు.ఇకపోతే ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: