మెగా మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ ఈ సంవత్సరం ప్రారంభంలో తన మొదటి సినిమా అయిన ‘ఉప్పెన’ తో హీరోగా సినీ పరిశ్రమలోకి చాలా గ్రాండ్ గా ప్రవేశించాడు. మొదటి సినిమా హీరోగా దాదాపు 20 సంవత్సరాలు పైగా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించి అందరిలో హాట్ టాపిక్ గా అయ్యాడు. బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ మొదటి సినిమా కహోనా ప్యార్ హై సినిమాతో ఆయన సృష్టించిన రికార్డ్ కూడా వైష్ణవ్ తేజ్ బద్దలు కొట్టాడు . ఇక మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టడం కూడా చాలా అరుదైన రికార్డ్. అందుకే సినీ పరిశ్రమలోనే మొదటి సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయాడట వైష్ణవ్ తేజ్.ఆ మధ్య భారీ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఒక మూవీ ప్రకటన చేశారు. ఈ సినిమాను ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ తో మంచి విజయం అందుకున్న టాలెంటెడ్ దర్శకుడు అయిన గిరీష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని సమాచారం.కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా ఎప్పుడో మొదలు అవ్వాల్సి ఉండగా బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు అన్నీ సినిమాలు మళ్ళీ మొదలవుతున్న సమయంలో వైష్ణవ్ కూడా తన సినిమాను మొదలు పెడుతున్నాడని సమాచారం .
ఉప్పెన సినిమా విజయంతో వైష్ణవ్ రేంజ్ మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయిన వైష్ణవ్ మొదటి సినిమాతోనే తనలోని నటన టాలెంట్ ను కనబరిచాడు.దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు బాగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఈనేపథ్యంలో వైష్ణవ్ ఆచి తూచి సినిమాలు ఎంపిక చేస్తున్నాడట. సినిమాకి BVSN ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ నటించనున్నట్లు సమాచారం
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ గారు మాట్లాడుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది.అర్జున్ రెడ్డి' తమిళ వెర్షన్‌ను దర్శకత్వం వహించి విజయం సాధించిన సందీప్ రెడ్డి వంగా శిష్యుడు అయిన గిరీష్ ను ఈ చిత్రంతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము . ఉప్పెనతో యువతకు బాగా దగ్గరైన వైష్ణవ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చేలా మంచి కథతో ఫ్యామిలీ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపడం జరిగింది.