డైరెక్టర్ చేతిని తాకానని.. అతని భార్య నానా రచ్చ చేసింది : సింగర్ సునీత
ఒకానొక సమయంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ భార్య కారణంగా తాను ఎంతో అవమాన పడ్డాను అంటూ సునీత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక పాట పాడాల్సి ఉన్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో కి పిలిచారు. ఈ క్రమంలోనే పాట పాడేందుకు ఆ డైరెక్టర్ తన చేతిలో ఉన్న మైక్ ఇచ్చారు. ఇక ఆ మైక్ తీసుకున్న నేను పాట పాడి స్టూడియో నుంచి బయటకు వచ్చి ఆ మైక్ అక్కడ టేబుల్ పైన పెట్టాను. కానీ ఇదంతా ఎంతో సేపటినుంచి ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య గమనిస్తూ వచ్చింది. ఇక నేను స్టూడియో నుంచి బయటకు రాగానే తన దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని గట్టిగా అరిచింది.
నేనేం చేశాను అంటూ ఆవిడని నేను అడిగాను. నువ్వు మైక్ తీసుకునే సమయంలో నీ చేతి వేళ్ళు మా ఆయన చేతికి తగిలాయి. అలా నీ చేతి వేళ్లను మా ఆయనకు తగిలించడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి అంటూ అందరి ముందు దారుణంగా ఆమె నన్ను అవమానించింది అంటూ సింగర్ సునీత చెప్పుకొచ్చింది. ఇక ఆ సమయంలో ఎంతో కోపం వచ్చిందని ఇక నా స్టైల్ లోనే సమాధానం చెప్పాను అంటూ తెలిపింది. కానీ ఆ ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని ఒక రకమైన ఫీలింగ్ తెచ్చింది అంటూ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. తన జీవితంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి.ఎంతో మంది కొట్టాల్సింది. కానీ తన స్వభావం కారణంగా కొట్టకుండా వదిలేసాను. కేవలం తిట్టడంతో సరిపెట్టుకున్నా అంటూ సింగర్ సునీత తెలిపింది .