ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్న సినిమా ఇప్పటికీ వర్క్ అవుట్ అయ్యింది..

P.Nishanth Kumar
రీమేక్ సినిమా లు చేయడం లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఉన్నంత మోజు మరే సినిమా పరిశ్రమకు ఉండదేమో. ప్రస్తుతం స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల్లో దాదాపు సగం వరకు రీమేక్ సినిమాలే కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు కాకుండా చిన్నతరహా హీరోలు సైతం రీమేక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎక్కువ రీమేక్ చేసిన హీరోలే కాకుండా అసలు రీమేక్ జోలికి వెళ్లని హీరోలు కూడా ఉన్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు రీమేక్ అంటే ఆమడ దూరంలో ఉన్నారు.

రీమేక్ సినిమాలే కాకుండా మరొక ట్రెండ్ కూడా టాలీవుడ్ లో బాగా నడుస్తుంది అదే బయోపిక్ సినిమా లు చేయడం. గొప్ప గొప్ప వారి కథలను సినిమాలుగా చేసి ఇప్పటికే టాలీవుడ్ లో కొంత మంది హీరోలు హిట్ లు కొట్టగా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఓ వ్యక్తి బయోపిక్ ను చేయాలని ప్రయత్నిస్తే అది ఇప్పటికీ కుదిరేలా ఉంది. స్టువర్ట్ పురం కి చెందిన ప్రసిద్ధ గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయాలని కొన్ని సంవత్సరాలుగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ సన్నాహాలు చేస్తున్నారు.

ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ తో ఈ సినిమాను చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.  ఇప్పుడు అదే కథను హీరో రవితేజ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఖిలాడి, రామారావు అనే రెండు సినిమాలను చేస్తున్నాడు రవితేజ. ఈ రెండు సినిమాల తరువాత ఆయన తన తదుపరి చిత్రాన్ని టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేయనున్నాడట. వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా రాబోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది లో సెట్స్ పైకి వెళ్లి అదే ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: