ఇకపై అలా చేస్తే వాళ్ళ తాట తీస్తా అంటున్న కరాటే కళ్యాణి..?

Anilkumar
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కరాటే కల్యాణి ఈ మధ్య కాలంలో పలు సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తోంది.ఈ క్రమంలో తాజాగా విడుదలైన 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలోని పలు సన్నివేశాలు, సంభాషణలు హిందువుల మానోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.అంతేకాదు దీనిపై కొన్ని సంఘాల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సినిమా దర్శకుడు యుగంధర్ ఈ సినిమాలో శృంగార సన్నివేశాల సందర్భంగా వచ్చిన భజ గోవిందం అనే పాటను తీసేసారు.ఇదిలా ఉంటె దర్శక నిర్మాతలు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికే ఈ భజ గోవిందం అనే పాటని పెట్టినట్లు తెలుస్తోంది.


అలా మొత్తానికి తమ సినిమాకి ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకున్నారు.అయితే సినిమాలో ఆది శంకరాచార్యుల భజ గోవిందం పాటని పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ..ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో ఎంతో పవిత్రమైన ఈ పాటని పెట్టడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా కరాటే కల్యాణి కొన్ని హిందూ సంఘాల వారితో కలిసి ప్రెస్ మీట్ ని నిర్వహించారు.ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలు నిర్మించే వారిపై ఫైర్ అయ్యారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..సినిమాల ప్రభావం అనేది సమాజం పై ఎంతో ఉంటుంది.
ఇంకా పిల్లలపై ఆ ప్రభావం చాలా ఉంటుంది.


 నేను కూడా ఎన్నో సినిమాల్లో నటించాను.సినిమాలో చేస్తున్నానని దేవుళ్ళకు సంబంధించిన వాటిని కించపరుస్తుంటే నేను అస్సలు సపోర్ట్ చేయను.సినిమాల్లో ఇలాంటి అభ్యంతర సన్నివేశాలు ఉంటేనేను ఎక్కడికైనా ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధమే.నా సంస్కృతి, సాంప్రదాయాలను కించపరిస్తే ఊరుకునేది లేదు.ఈ సినిమాలోనే కాదు వరుడు కావలెను సినిమాలోని దిగు దిగు దిగు నాగ, అలాగే మహాసముద్రం సినిమాలోని మరో పాటలో కూడా దేవుళ్లను కించపరిచే కొన్ని వాక్యాలు ఉన్నాయి.ఒక భారతీయ స్త్రీ గా ఇలాంటివి నేను తప్పకుండా ప్రశ్నిస్తాను అని గట్టిగానే ఫైర్ అయ్యింది. అంతేకాదు మా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఇలాంటి చెత్త ట్రిక్స్ తో తమ సినిమాలని ప్రమోట్ చేసుకునే వాళ్ళ తాట తీస్తా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరి మాట్లాడింది కరాటే కల్యాణి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: