పొంగల్ రేసు: తేడా వస్తే ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ .... ??

GVK Writings
ఇటీవల మెల్లగా థియేటర్స్ తెరుచుకోవడంతో పలు సినిమాలో విడుదలయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులు కనుక తగ్గుముఖం పడితే మరికొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే పలు బడా సినిమాలు తమ విడుదల డేట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ పుష్ప క్రిస్మస్ కి రానుండగా కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా దాదాపుగా అదే టైం లో విడుదలయ్యే ఛాన్స్ కనపడుతోంది. ఇక అసలు విషయం ఏమిటంటే రాబోయే 2022 సంక్రాంతి సందర్భంగా ఏకంగా ముగ్గురు బడా స్టార్స్ తో పాటు మరొక రెండు సినిమాలు కూడా బెర్త్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి.
వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా జనవరి 13న విడుదల కానుంది. పరశురామ్ తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా యాక్ట్ చేస్తుండగా థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల కలయికలో తెరకెక్కుతున్న అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ కూడా వేగంగా షూట్ ని జరుపుకుంటోంది. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తుండగా నాగ వంశీ ఈ సినిమాని ఎంతో భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 12న విడుదల అవనుంది. మరోవైపు ఇటీవల షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా పొంగల్ రేస్ లో నిలిచి జనవరి 14న రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రాధాకృష్ణ తీస్తుండగా యువి క్రియేషన్స్ వారు దీనిని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వీటితో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్ 3, అలానే ఇలయతలపతి విజయ్ బీస్ట్ సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో నిలవనున్నట్లు సమాచారం. అయితే ఒకేసారి ఇన్ని భారీ సినిమాలు పొంగల్ రేస్ లో నిలిస్తే కొంత థియేటర్స్ షేరింగ్ విషయమై సమస్యలు తలెత్తుతాయని, అది మాత్రమే కాక ఆ సమయంలో ఏదైనా సినిమా అంచనాలు అందుకోలేక చతికలపడితే దాని పరిస్థితి ఘోరంగా మారే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి రాబోయే పొంగల్ బాక్సాఫీస్ బరిలో నిలవనున్న సినిమాల్లో ఎవరు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి .... !!




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: