'కేజిఎఫ్ 2' క్లైమాక్స్ లో మార్పు... షాక్ ఇచ్చేలా ఉన్నాడుగా ?

VAMSI
కన్నడ మూవీ 'కేజిఎఫ్' ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల బాక్సాఫీస్ ను కొల్లగొట్టి రికార్డులు తిరగ రాసింది. ఈ చిత్రంతో హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 1 కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చాప్టర్ 2 మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని తొలుత జూలై 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ గ్యాప్ లో క్లైమాక్స్ లో ఒక సీన్ ను రీ షూట్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మొదట కాస్త వైలెంట్ గా ముగించగా, ఇపుడు దాన్ని కొద్దిగా మార్పు చేసి సెంటిమెంట్ టచ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కేవలం ఈ ఒక్క షూట్ కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చయిందని వినికిడి. మరి ఇంతటి భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న ఆ సన్నివేశం ఏమిటో తెరపైనే చూడాల్సి ఉంది. అయితే ఈ విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. కేజిఎఫ్ చాప్టర్ 1 కన్నడలో తప్ప మిగిలిన ఏ భాషలోనూ పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై
మొత్తం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి  సంచలనంగా మారగా ఇప్పుడు ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదల కానున్న కేజిఎఫ్ చాప్టర్ 2 అంతకు మించిన వసూళ్ల వర్షం కురిపిస్తుంది అని అంతా అనుకుంటున్నారు.

ఈ సినిమాపై ఎంత హైప్ ఉందంటే ఇప్పుడిప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తారు. ఇందులో కథే హీరో.. ఆ తరువాత హీరో యశ్ నటన ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాత్రను ఎంతగా ఎలివేట్ చేసి ఉంటారో ఊహించలేము. ఈ సినిమాతో యశ్ రేంజ్ ఎంతలా మారిందో చూశాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: