మా ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే...?

Suma Kallamadi

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. సాధారణ ఎన్నికల వలె ప్రజలు ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మా అధ్యక్ష బరిలో ఇప్పటికే చాలా మంది హేమాహేమీలు బరిలో ఉన్నారు. చాలా మంది మాను ఆర్టిస్టులను సమస్యల నుంచి గట్టెక్కిస్తామని చెబుతున్నారు. కొంత మంది మాత్రం ప్రాంతీయ వాదంతో ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. మా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తరువార ఎవరు గెలుస్తారో చూడాలి. అధ్యక్ష బరిలో ఉన్న  ప్రకాశ్ రాజ్ అందరికంటే ముందుగా తన ప్యానెల్ ను కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎన్నికల హడావుడి కాస్త తగ్గిందనే చెప్పాలి. హేమా హేమీల పోటీతో మా అధ్యక్ష ఎన్నికలు ఒక్క సారిగా రణరంగంగా మారాయి. కానీ అటు తర్వాత అందరూ చల్లబడడం గమనార్హం.
మా అధ్యక్ష బరిలో నిలిచిన మంచు మోహన్ బాబు వారసుడు విష్ణు మా పెద్దలు కలుగజేసుకుని ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే తాను సపోర్ట్ చేస్తానని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటానని కూడా విష్ణు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు. కాగా మా అధ్యక్ష బరిలో దూకుడు ప్రదర్శించిన జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ తాజాగా తెలుగులో ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల అంశాన్ని తెగేదాక లాక్కండి అంటూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. ప్రకాశ్ రాజ్ ప్యానల్ ను ప్రకటించి దూకుడుగా వెళ్తున్న తరుణంలో ఆయన నాన్ లోకల్ అభ్యర్థి అని పలువురు కామెంట్లు చేశారు. కొంత మంది మాత్రం కళాకారుల్లో లోకల్ నాన్ లోకల్ అనేది లేదని అందరూ కళమ్మ తల్లి ముద్దు బిడ్డలే అని తెలిపారు. అసలు ఈ సారి మా అధ్యక్షుడుని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా? లేక ఎన్నికలు నిర్వహిస్తారా? అనే విషయం తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: