సింగర్ చిత్రకు తెలుగు అక్షరాలు నేర్పింది ఎవరో తెలుసా..?

VUYYURU SUBHASH
తొలి పలుకుల రాగం.. పొద్దు పొడిచే వేళ.. విన్నప్పుడు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇక అంతటి చక్కటి రాగాన్ని మనకు వినసొంపుగా వినిపించింది.. ప్రముఖ గాయకురాలు చిత్ర. ఈమె తమిళ్, కన్నడ  వంటి సినీ ఇండస్ట్రీ లో ఎన్నో పాటలకు తన గాత్రాన్ని అందించి,  తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మధురంగా పాడి ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇంతటి చక్కటి స్పష్టమైన పలుకులతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఈమెకు ఈ తెలుగు అక్షరాలు నేర్పింది ఎవరు..? అనే విషయం గురించి తెలుసుకుందాం..

ప్రముఖ గాయకురాలు చిత్ర ఇంత అద్భుతంగా తన గాత్రంతో పాటలు పాడడం వెనుక సంగీత దర్శకుడు అలాగే గాయకుడు అయినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉన్నారట.. ఇటీవల ఈమె ఆలీతో సరదాగా షో కి హాజరు కావడం జరిగింది. ఈ షోలో అలీ చిత్ర ను మీరు తెలుగు అక్షరాలు నేర్చుకుంటున్నారు అంట కదా ..! అని అడగగా,  అందుకు చిత్ర సమాధానంగా .." ఇప్పుడు కాదు ఎప్పటినుంచో తెలుగు అక్షరాలను నేర్చుకుంటున్నాను. అందుకు మొదట మూలాధారం బాలుగారు.. తెలుగు అక్షరాలను రాసిచ్చింది ఆయనే" అని చెప్పింది..

"బాలు గారితో కలిసి ఎన్నో పాటలు పాడాను. ఈ క్రమంలో నాకు ఏదైనా సందేహం కలిగినప్పుడు, నేను బాలు గారితో నా సందేహాలను నివృత్తి చేసుకునే దానిని. ఇక ఆయనతో కలిసి ఉండడం, పాటలు పాడడం వంటివాటి వల్ల నేను తెలుగులో మంచి గాయకురాలిగా గుర్తింపు పొందడానికి కారణం అయింది" అని చెప్పింది. అంతే కాదు "తన జీవితం ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే మొదటి స్థానం బాలు గారు అయితే రెండవ స్థానం జేసుదాసు" అని చెప్పుకొచ్చింది.. ఇక వీరిద్దరి వల్లే తను ఇండస్ట్రీలో ఇంత గొప్ప స్థాయిలో చేరుకోవడానికి కారణమని కూడా చిత్ర తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: