టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ లా నటించ గలిగె ఎన్టీఆర్ ల డాన్స్ చేసే ఎన్టీఆర్ ల హావభావాలను పలికించే నటుడు మరొకరు లేరు అనేది ఎన్టీఆర్ అభిమానుల వాదన. వారికి తగ్గట్లే ఎన్టీఆర్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరచకుండా అన్ని విభాగాలలో తననుతాను 100% నిరూపించుకుంటూ ఉంటారు. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయగల హీరో యంగ్ టైగర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా సినిమాకు తన బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేయడంలో ఎన్టీఆర్ ను మించిన వారు లేరు. అందుకే ఆయన ఒక్కో సినిమాలో ఒక్కో లా కనిపిస్తు అందరినీ ఎంతో ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. వాస్తవానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తయిన తర్వాత కూడా ఎన్టీఆర్ డైరీ ఫుల్ గా ఉంది. మరో మూడేళ్ల దాకా ఎన్టీఆర్ ఖాళీ అయితే లేడు. ఇకపోతే కొమరం భీమ్ పాత్ర కోసం గతం కంటే లావైన ఎన్టీఆర్ కొరటాల శివ కోసం బరువు తగ్గాల్సి ఉందట. బరువు తగ్గటం అంత కష్టమైన విషయం అయితే కాదు. కానీ కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమా కోసం మళ్లీ ఎన్టీఆర్ కొంత ఒళ్ళు చేయాల్సి వస్తుంది.
ఇలా దర్శకులు ఏది చెబితే అది చేస్తూ ఎన్టీఆర్ సినిమా పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కానీ దర్శకులు ఎన్టీఆర్ ను ఇలా బరువు పెరగడం తగ్గడం వంటివి చేయిస్తుంటే భవిష్యత్తు లో ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నారు ఆయన అభిమానులు. మొదటి సినిమా నుంచి గమనిస్తే ఒక్కో సినిమాలో ఒక్కోక్కలా తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకొని ఎన్టీఆర్ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారు. టెంపర్ సినిమా తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న తన సినిమా ల ఎంపిక లో మార్పు చూపిస్తున్నాడు ఎన్టీఆర్.