మీలో ఎవరు కోటీశ్వరుడు లో జూనియర్ రాజకీయ కోణం !
ఈ నెలలో ప్రారంభం కాబోతున్న ఈషో లో ఎవరు ఊహించని ఒక రాజకీయ కోణం ఉంది అంటూ అప్పుడే గాసిప్పుల హడావిడి మొదలైపోయింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈషో కు సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ అతిధిగా రావడం జరుగుతుంది. చరణ్ కు ఆ ఎపిసోడ్ కు సంబంధించి ఆశక్తిని కలిగించడానికి చరణ్ చేత జూనియర్ కు ప్రశ్నలు వేయించినట్లు టాక్.
ఆ ప్రశ్నల పరంపరలో రామ్ చరణ్ జూనియర్ ను ఉద్దేశించి "నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నావంటగా.." అంటూ ఒక ప్రశ్న ఉంటుందట. ఆ ప్రశ్నకు జూనియర్ నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడ చేశాడు అని అంటున్నారు. ఆ వ్యాఖ్యలు తన రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేవిగా ఉంటాయి అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రికార్డు అయిన ఆ ఎపిసోడ్ లో జూనియర్ తాను చేసిన కామెంట్స్ ను కట్ చేయవలసిందిగా ఆ షోను నిర్వహిస్తున్న టీమ్ కు తారక్ స్వయంగా చెప్పాడు అంటూ గుసగుసలు హల్ చల్ చేస్తున్నాయి.
దీనితో ఆ ఎపిసోడ్ లో తారక్ కొంచం ఘాటుగా కామెంట్స్ చేసి ఉంటాడు దానివల్ల మళ్ళీ వివాదాలు రేగుతాయి కాబట్టి తన కెరియర్ తారా స్థాయిలో ఉన్న పరిస్థితులలో ఈ అనవసరపు వివాదాలు వద్దనుకుని జూనియర్ తెలివిగా వ్యవహరించి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆ షోలో జూనియర్ చరణ్ ల మధ్య రాజకీయ చర్చలు జరిగాయో లేదో తెలియదు కానీ అప్పుడే రకరకాల ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి..