మహానటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!?

N.ANJI
ఇండస్ట్రీలో నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పేరుకు మళయాల ముద్దుగుమ్మ అయినా కూడా తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకి అలా మొదలైంది సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక టాలీవుడ్ లో మరో సౌందర్య అనిపించుకునే ఈ అమ్మడు అందరి కంటే భిన్నంగా మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని దర్శకుడు నాగశ్విన్ మహానటి సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించారు. ఈ సినిమాలో  సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ కు ఎంత గొప్ప పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కంటే ముందు ఆమెను రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ లాగే చూసేవాళ్లు. కానీ.. ఈ మూవీ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమాలో సావిత్రి పాత్రకు ఆమె ప్రాణం పోసింది. ఇక కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రి మళ్ళీ జన్మించినట్లుందని సావిత్రి కూతురు చెప్పుకొచ్చారు. ఆమె అంతలా ఆ పాత్రలో లీనమై నటించారు. ఇక  కీర్తి సురేష్.. అయితే వాస్తవానికి ఈ సినిమా కోసం అనుకున్న నటి కీర్తి కాదంట. ఇక దక్షిణాదిన నటించిన ప్రతి భాషలోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదించిన నిత్య మీనన్ ను ముందు సావిత్రి పాత్రలో నటించాలని అడిగారంట.
అయితే ఆమె కూడా ఒక దశలో ఓకే అంది. కాగా.. కారణాలేంటో తెలియదు కానీ.. తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ ఏమీ లేవని అంది కానీ.. 'మహానటి' సాధించిన విజయం - కీర్తికి వచ్చిన పేరు చూశాక నిత్యలో ఏదో ఒక మూల బాధ లేకుండా ఉండదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: