నితిన్ ను ఆశ్చర్య పరిచిన ఆ సినిమా రేటింగ్ !
భారీ అంచనాలు ఉన్న ఒక మూవీ ఫ్లాప్ అయినప్పుడు ఆ సినిమాను తీసిన దర్శక నిర్మాతలు రకరకాల కారణాలు చెపుతారు. తమ సినిమా సగటు ప్రేక్షకుడుకి నచ్చకపోయినా విమర్శకుల ప్రశంసలు లభించాయని తృప్తి పొందుతూ ఉంటారు. మరికొందరైతే తమ మూవీ బిసి సెంటర్ల ప్రేక్షకులకు బాగా నచ్చిందని తమ మూవీని కొనుక్కున్న బయ్యర్లు ఏమాత్రం నష్టపోలేదు అంటూ గంభీరంగా ఉంటారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన ‘చెక్’ మూవీ పై నితిన్ తో పాటు ఆమూవీకి దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ ఏలేటి కూడ బాగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈసినిమాలో చెస్ ప్లేయర్ గా నటించిన నితిన్ చదరంగం ఆడే ఆటగాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోవడమే కాకుండా వారి బాడీ లాంగ్వేజ్ పై కూడ బాగా రిసర్చ్ చేసి కష్టపడి నటించాడు. అయితే ఆమూవీ విడుదల తరువాత ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
దీనితో నిరాశ పడ్డ నితిన్ మౌనంగా మారిపోయాడు. ఈమధ్య ఈమూవీని జెమిని టివి మొదటిసారి ప్రసారం చేసింది. ఎవరు ఊహించని విధంగా ఈమూవీకి 8.53 రేటింగ్ వచ్చాయి. నితిన్ మూవీలలో హిట్ గా నిలిచినా ‘భీష్మ’ ‘రంగ్ దే’ మూవీల కంటే ఈసినిమాకు చాల ఎక్కువ రేటింగ్ వచ్చింది. అంతేకాదు ఈమూవీని బుల్లితెరపై చూసిన కొంతమంది ప్రముఖులు నితిన్ కు ఫోన్ చేసి బాగా నటించావు అంటూ అభినందనలు తెలియ చేస్తే నితిన్ మైండ్ బ్లాంక్ అయిందట.
గతంలో కూడ ధియేటర్ల ఫ్లాప్ అయిన అనేక సినిమాలు బుల్లితెర పై ప్రసారం అయినప్పుడు చాల మంచి రేటింగ్స్ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ గా మారిన ‘రామయ్యా వస్తావయ్యా’ మూవీని ఇలాగే బుల్లితెర పై తెగ చూశారు. దీనితో అర్థం అయింది ఏమిటంటే ధియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచి ఒకలా బిల్లితెర పై ఓటీటీ లలో సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచి ఒకలా మారిపోయిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..