ఆయన కారణంగానే ప్రాణాలు దక్కించుకున్న ఈవీవీ సత్యనారాయణ..!
ఇకపోతే అలాంటి వారిలో మన ఈవీవీ సత్యనారాయణ కూడా ఒకరు. ఈయన మొదట ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.ఇక ఆ తరువాత దర్శకుడిగా మొదటి చిత్రం చెవిలో పువ్వు. ఇక మొదటి ప్రయత్నంతోనే పరాజయాన్ని పొందడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ వి వి సత్యనారాయణ. ఇక సినీ ఇండస్ట్రీని వదిలి పెట్టాలని కూడా నిశ్చయించుకున్నాడు. అంతే కాదు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, ఈవీవీ సత్యనారాయణ కు ఫోన్ చేసి మరీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు.
ఆ సినిమానే ప్రేమ ఖైదీ. ఈ చిత్రానికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు . ఇక ఈ సినిమా ఊహించని విధంగా దాదాపు అన్ని థియేటర్లలో విజయవంతంగా ఆడి , మంచి విజయాన్ని అందుకుంది. ఇక అంతే ..ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా విజయవంతం అందుకోవడంతో ఆయన వెనుతిరిగి చూడలేదు. ఇక ఆయన గురువు జంధ్యాల నేర్పిన మార్గాన్ని పాటిస్తూ.. మంచి మంచి కామెడీ సినిమాలకు ప్రాణం పోస్తూ, ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఈవీవీ సత్యనారాయణ.