'జాతిరత్నం'తో సమంత... ట్రెండ్ సృష్టించేనా ?

VAMSI
'జాతిరత్నాలు' సినిమాతో ఒక్క సారిగా ఫేమస్ అయ్యాడు సొట్టబుగ్గల సుందరాంగుడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోతారని అంతా అనుకున్నారు. అయితే అధికారికంగా ఇతని సినిమాలపై ఇంత వరకు పెద్దగా క్లారిటీ రాలేదు. నవీన్ పోలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్కతో ఓ సినిమా చేయబోతున్నారు అనే వార్త ప్రచారం జరిగింది. ఆ తర్వాత రద్దు అయింది అని, మళ్లీ షురూ అయింది అంటూ, రకరకాల వార్తలు వినిపించాయి. కానీ అధికారికంగా మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే నవీన్ పోలిశెట్టి గురించి తాజాగా మరో వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రస్తుతం వైవిధ్య భరిత పాత్రలు ఎంచుకుంటూ జోరు చూపిస్తున్న అక్కినేని కోడలు సమంత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్ కథనంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో సమంతతో పాటు నవీన్ పోలిశెట్టి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.  ఈ చిత్రంలో సామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారట. మహానటి చిత్రంలో ఆ కాలపు జర్నలిస్ట్ గా కనిపించి మెప్పించిన సామ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో టెక్నాలజీని టెక్నిక్ గా వినియోగించే  జర్నలిస్ట్ గా కనిపించనుంది అంటూ వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా అనుకున్నట్లు జరిగి ట్రెండ్ సృష్టిస్తుందేమో చూడాలి.

ఇక ఈ కథ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త కోణంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత పౌరాణిక కథాంశంతో రూపుదిద్దుకుంటున్న శాకుంతలం చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. ఇందులో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఒక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: