ఇలియానా ప్రేమ‌లో చిచ్చు పెట్టింది ఆ స్టార్ హీరోయేనా ?

VUYYURU SUBHASH
సన్న నడుము అందాల సుందరి ఇలియానా టాలీవుడ్ ను ఏడెనిమిది సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపేసింది. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఇలియానా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా తెలుగు యువత మదిని గిలిగింతలు పెట్టింది. ఆ సినిమా తర్వాత ఇలియానా వరుస పెట్టి తెలుగులో స్టార్ హీరోలతో నటిస్తూ ఒక ఊపు ఊపేసింది. ఎన్టీఆర్ తో శ‌క్తి, రాఖీ సినిమాల్లో జోడీ క‌ట్టి మెప్పించింది. బ‌న్నీతో జులాయి - ప‌వ‌న్ తో జ‌ల్సా - ర‌వితేజ తో అయితే ఏకంగా మూడు సినిమాలు చేసింది. అప్ప‌ట్లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది.

ఇక్క‌డ తిరుగులేని క్రేజ్ తో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలోనే ఆమె బాలీవుడ్‌ను ఏలేయాల‌ని అక్క‌డ‌కు చెక్కేసింది. అక్క‌డ రెండు మూడు సినిమాల్లో ఛాన్స్ వ‌చ్చినా స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత త‌న త‌ప్పు తెలుసుకుని ఆమె తిరిగి తెలుగులోకి వ‌చ్చినా అప్ప‌టికే ఇక్క‌డ యంగ్ హీరోయిన్లు దూసుకు పోవ‌డం.. ఆమె ఫేడ‌వుట్ అయిపోవ‌డంతో ఆమెను ప‌ట్టించుక‌న్న వాళ్లు లేరు. ఎలాగోలా ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేసినా అది కూడా ప్లాప్ అవ్వ‌డంతో ఇలియానా పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయింది.

కొన్నాళ్ల పాటు ఆస్ట్రేలియ‌న్ ఫొటోగ్రాఫ్ ఐ ఆండ్రూ తో డేటింగ్ చేసిన ఆమె ఉన్న‌ట్టుండి అతడితో విడిపోయింది. ఇందుకు కార‌ణం ఏంట‌న్న‌ది చాలా మందికి తెలియ‌లేదు. బాలీవుడ్ లో భార్య‌కు విడాకులు ఇచ్చిన ఓ సీనియ‌ర్ హీరోతో ఆమె ప్రేమ‌లో ఉండ‌డ‌మే కార‌ణం అంటున్నారు. పైగా అత‌డు మ‌రో పెళ్ల‌యిన మాజీ హీరోయిన్ ( ఓ స్టార్ హీరో భార్య‌) తో కొన్నాళ్లు డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఆమెను వ‌దిలేసి ఇలియానాను ప‌ట్టాడ‌ట‌. అత‌డి మోజులో ప‌డిన ఇల్లూ బేబీ చివ‌ర‌కు ఆండ్రూకు దూర‌మైన‌ట్టు టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: