జాతిరత్నాలు సీక్వెల్: నవీన్ రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగుతుంది..!
జాతిరత్నాలు పార్టు 1లో నవీన్ పొలిశెట్టి హైదరాబాద్ వెళ్లి ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. అంతేకాకుండా హైదరాబాద్ లో చిట్టి (ఫారియా అబ్దుల్లా) ని చూసి ఆమెపై మనసు పారేసుకుంటారు. తర్వాత తన తెలివిని ఉపయోగించి ఎలాగోలా చిట్టి మనసును దోచేస్తారు. మరి దానికి కొనసాగింపుగా రాబోతున్న జాతిరత్నాలు 2లో ఏ భామ పై మనసు పారేసుకుంటారో చూడాలి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో.. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అధికారికంగా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా.. హీరోగా 100% సక్సెస్ రేటుతో దూసుకెళ్తున్న నవీన్ తనకున్న డిమాండ్ ను బట్టి పారితోషికాన్ని విపరీతంగా పెంచేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. జాతి రత్నాలు సీక్వెల్ కోసం ఆయన అక్షరాలా మూడుకోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఒక యువ హీరో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. అయితే ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. రెండో సినిమాపై సహజంగానే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ క్రేజ్ ను బట్టి, తనకున్న డిమాండ్ ని బట్టి నవీన్ పొలిశెట్టి తన పారితోషికం పెంచారని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత అయిన స్వప్న దత్( నాగ్ అశ్విన్ బంధువు) రూ. 3కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారట. కాగా ఈ సినిమా షూటింగ్ ని స్వప్న ఫిలింస్ బ్యానర్ పై వచ్చే ఏడాది ప్రారంభించనున్నారని సమాచారం.