సౌందర్యతో తనకున్న బంధాన్ని తెలిపిన జగపతిబాబు..

Divya
జగపతి బాబు.. జగపతి బాబు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్ గా  గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇక ఏ పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయగల సత్తా జగపతిబాబు కు వుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ఎక్కువగా రచనలకు బాగా పేరుగాంచారు. ఇక సుమారుగా 32 సంవత్సరాల సినీ కెరీర్లో , దాదాపు 120 చిత్రాల్లో నటించి,  తెలుగు ఫిలింఫేర్ అవార్డులతో పాటు 7 నంది అవార్డులు కూడా అందుకోవడం విశేషం. తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించి, దక్షిణ భారతదేశమంతటా మంచి గుర్తింపు వ్యక్తి.

ఇక సౌందర్య విషయానికి వస్తే, ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సౌమ్య. అయినప్పటికీ వృత్తిరీత్యా సౌందర్య అని పేరు మార్చుకుంది. ఈమె కన్నడ నటి కాకపోతే, తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ,హిందీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన సౌందర్య, జాతీయ చలన చిత్ర అవార్డులతో పాటు, కర్ణాటక నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఫిలిం ఫేర్ అవార్డులను కూడా అందుకుంది . అంతేకాదు ఉత్తమ నటిగా 3 సార్లు నంది అవార్డులను కూడా అందుకున్న హీరోయిన్. అయితే విమానం  ప్రమాదంలో సౌందర్య మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న జగపతిబాబు అలాగే సౌందర్య ల మధ్య ఏదో ఎఫైర్ ఉందంటూ.. కొన్ని నెలలపాటు  వార్తలు  చాలా వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై జగపతిబాబును అడగగా.. " సౌందర్యను ,  నేను అందరి కంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను.దానిని లవ్ అని అంటారో..? ఏమో..? నాకు తెలియదు. ఆమె కుటుంబంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వాళ్ల తల్లిదండ్రులు కూడా నన్ను ఇన్వైట్ చేసేవారు . అంత బాగా వారి ఫ్యామిలీకి నేను దగ్గరయ్యాను. కానీ ప్రజలు దాన్ని ఎఫైర్ గా సృష్టించారు. ఒక అమ్మాయి, అబ్బాయి తో క్లోజ్ గా ఉండడం వల్ల అది ఎఫైర్ అవుతుందని అనుకోవడం చాలా తప్పు. కాకపోతే నేను సౌందర్యాన్ని చాలా మిస్ అయ్యాను".. అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: