కాంచన- 4 మూవీలో కాజల్ అగర్వాల్?

murali krishna
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని హారర్ కామెడీ జోనర్ గా వచ్చి విజయం సాధించింది. ముని సినిమా బాగానే వున్నా కమర్షియల్ గా అంతగా ప్రభావం చూపించలేదు. రాఘవ లారెన్స్  మునికు  సీక్వల్గా కాంచన(ముని-2)తెరకెక్కించడం జరిగింది. హిజ్రాలు  కూడా అనుకున్నది సాధించగలరు అనే మంచి కథాంశాన్ని ఎంచుకొని మునిని తెరకెక్కించినట్లు హారర్ కామెడీ జోనర్ లో తీసి కాంచనతో మంచి విజయం సాధించాడు.రాఘవ లారెన్స్ కు కాంచన సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కోలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది.కాంచన  విజయంతో టాలీవుడ్ లో హారర్ కామెడీ జోనర్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చిన కాంచన మూవీ  వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది.
కాంచన విజయంతో రాఘవ లారెన్స్ ముని-2 కి సీక్వల్ గా గంగ(ముని-3) ను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. కానీ కాంచన  సినిమా అంత  ప్రభావం చూపించలేకపోయింది. దాని తరువాత కాంచన  సినిమాకు సీక్వల్ గా కాంచన-3 తీయడం జరిగింది. కానీ కాంచన-3 అనుకున్న విధంగా లేకపోవడంతో విజయం సాధించలేదు. కాంచన-3 కి సీక్వల్ గా కాంచన-4 తెరకెక్కించబోతున్నట్లు రాఘవ లారెన్స్ తెలిపాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ముని సినిమాలో వేదిక హీరోయిన్ గా నటించింది. కాంచన సినిమాలో లక్ష్మిరాయ్ నటించింది.గంగ సినిమాలో తాప్సీ, నిత్య మీనన్ నటించారు. కాంచన-3 సినిమాలో నిక్కీతంభోలి, ఓవియా, వేదిక హీరోయిన్స్ గా నటించారు. కాంచన-4 లో కాజల్ నటించబోతున్నట్లు గాసిప్ వినిపిస్తోంది.కాజల్ ఇటీవల వివాహం చేసుకొని భర్త కిచ్లు అనుమతితో  మంచి సినిమాలు చేస్తుంది.పెళ్లి అయినా  కాజల్ కు ఆఫర్స్ తగ్గడం లేదు. కాజల్ మంచి కథ వస్తే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికి కూడా సిద్ధం అని తెలిపింది.కాజల్ హీరోయిన్ గా తమిళంలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ  పారిస్ -పారిస్ OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా హిందీలో కంగనా రనోత్ నటించిన క్వీన్ కి రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాను తెలుగులో థట్ ఈజ్ మహాలక్ష్మి పేరుతో రీమేక్ చేయడం  జరిగింది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: