ప్రభాస్ సెన్సాఫ్ హ్యూమర్ పై కృతి సనన్ కామెంట్స్ !

frame ప్రభాస్ సెన్సాఫ్ హ్యూమర్ పై కృతి సనన్ కామెంట్స్ !

Seetha Sailaja
మూడు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఇండియాలో టాప్ సెలెబ్రెటీ గా మారిన ప్రభాస్ చాల తక్కువ మాట్లాడుతాడని అదేవిధంగా చాల మొహమాటస్తుడని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే ప్రభాస్ సినిమా ఫంక్షన్స్ లో కాని అదేవిధంగా మీడియా ఇంటర్వ్యూలలో కాని చాల తక్కువ మాట్లాడుతూ ఉంటాడు.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మాత్రం ప్రభాస్ లో సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువని కామెంట్స్ చేసింది. ఈమధ్య ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి ఈ కామెంట్స్ చేసింది. దీనితో ప్రభాస్ మారిపోయాడా అంటూ అతడి సన్నిహితులు కూడ ఆశ్చర్యపోతున్నారు.  
 ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా లో సీత పాత్రను కృతి సనన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ తో ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేసిన కృతి సనన్ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

ప్రభాస్ చాల మొహమాటస్తుడు ఎవరితోనూ ఎక్కువగా మాటాడడని తనకు చాలామంది చెప్పారని ఇది వాస్తవం కాదు అని అంటోంది. ప్రభాస్ తో ఒక్కసారి మాట్లాడితే చాల విషయాలు మాట్లాడుతూ అనేక విషయాలు షేర్ చేసుకుంటాడు అని కామెంట్స్ చేసింది. మొదట తాను  ‘హాయ్’ అని చెప్పినప్పుడు ప్రభాస్ కాస్త మొహమాటంగా అనిపించినా ఆతర్వాత అతడి తీరు పూర్తిగా మారిపోయింది అన్న విషయాన్ని బయటపెట్టింది.
అంతేకాదు ప్రభాస్ మంచి మాటకారి అని ఆయన సెన్సాఫ్ హ్యూమర్ అద్బుతం అంటూ కృతి సనన్ ప్రశంసలు కురిపించింది. గతంలో ‘సాహో’ హీరోయిన్ శ్రద్ద కపూర్ కూడా ప్రభాస్ కు సన్నిహితంగా ఉండేది. ఆమె అత్యంత సన్నిహితురాలిగా ప్రభాస్ తో షూటింగ్ స్పాట్ లో ఉండటం చూసి వీరిద్దరి స్నేహం పై రకరకాల వార్తలు వచ్చాయి. దీనితో బాలీవుడ్ ట్రెండ్ కు అనుగుణంగా ప్రభాస్ మారిపోయి హీరోయిన్స్ తో చనువుగా ఉంటున్నాడా అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: